Share News

ప్రశ్న పత్రం

ABN , Publish Date - Apr 13 , 2026 | 01:25 AM

ఎత్తైన గోడ వెనక చిన్న మొక్కొకటి నాటినట్టు ఈ కలవరింతల శరీరం లోపల తటపటలాడే మనసొకటుందని...

ప్రశ్న పత్రం

ఎత్తైన గోడ వెనక చిన్న మొక్కొకటి నాటినట్టు

ఈ కలవరింతల శరీరం లోపల

తటపటలాడే మనసొకటుందని

అది నాకు నేనిచ్చుకున్న కానుకని అనుకున్నప్పుడు

పురివిప్పిన ఉదయం మరింత అందంగా

ఊగుతుంది

ఎవరైనా పొగిడినప్పుడో మిటకరించి నవ్వినప్పుడో

ఈ ద్వందాలెందుకో అర్థం కాక

కుడి ఎడమల గోడలతో బంతాడినట్టు

మనసు కుతకుతమంటుంది

మెచ్చటం గిచ్చటం అనేవి సున్నం ఇసుకల్లా

లోకాన్ని గట్టి పరిచాయని

భిన్నంగా ఉండటం లోకం పోకడని

కాస్తాగి సర్దుకుంటుంది

మనసనే కానుకొకటి లేకుంటే

అదిచ్చే కలవరమేదీ లేకుంటే

తర్కాలు లేని జీవితం చప్పగా

విలవిలలాడి ఉండేదని

ఒక నులివెచ్చని నిమిషం

ఉలికిపాటు మొనతో గుచ్చిపోతుంది

మనసనేది లేకుంటే మనం కేవలం

గడ్డి మేసే మందలం

వెన్నెల మింగని పక్షులం

అక్కడ మనం తలెత్తి చూడని అంతరిక్షం

ఎవరూ రాయని ప్రశ్న పత్రం

-రఘు

9676144904

Updated Date - Apr 13 , 2026 | 01:28 AM