Share News

మద్దతు ధరలు ఎండమావులేనా!

ABN , Publish Date - Sep 26 , 2026 | 12:51 AM

ఎనభై ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో రైతులు అత్యంత దీనావస్థలో ఉన్నారు. అధికారంలో ఏ పార్టీ ప్రభుత్వాలున్నా వ్యవసాయం పట్ల వివక్ష చూపుతూ, పెట్టుబడిదారీ దోపిడీ వర్గాలకే కొమ్ముకాస్తున్నాయి.

మద్దతు ధరలు ఎండమావులేనా!

ఎనభై ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో రైతులు అత్యంత దీనావస్థలో ఉన్నారు. అధికారంలో ఏ పార్టీ ప్రభుత్వాలున్నా వ్యవసాయం పట్ల వివక్ష చూపుతూ, పెట్టుబడిదారీ దోపిడీ వర్గాలకే కొమ్ముకాస్తున్నాయి. దీంతో రైతుకు కష్టాలు, అప్పులు పెరుగుతున్నాయి. రైతులు, వ్యవసాయ కూలీల ఆత్మహత్యలు 2014–2024 మధ్య రోజుకు 77 నుంచి 173కు పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. రైతుకు ప్రధాన ఆదాయ వనరు పంటలే. ఆదాయానికి భరోసా కల్పించాల్సిన మద్దతు ధరలు ఎండమావిగా మారాయి. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులు అమలు కావడంలేదు. 2014 ఎన్నికల్లో అమలు చేస్తానని హామీ ఇచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం, ఎ2+ఎఫ్‌ఎల్‌పై 50 శాతం కలుపుతూ సిఫార్సు అమలు చేస్తున్నట్లు చెబుతోంది. పంట ఖర్చుల అంచనా విధానంలో లోపాలున్నాయని రమేశ్‌చంద్‌ కమిటీ 2015లో 23 సిఫార్సులు చేసినా నేటికీ అమలు కాలేదు. మద్దతు ధరలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెరగడం లేదు. నిర్ణయించిన మద్దతు ధర కూడా రైతుకు మార్కెట్లో లభించడం లేదు. ‘పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలి. రైతులు, వ్యవసాయ కూలీల అప్పులు రద్దు చేయాలి. రైతాంగాన్ని కాపాడాలి. వ్యవసాయరంగాన్ని రక్షించాలి’ అనే నినాదాలతో సమరశీల ఐక్య ఉద్యమాలు సాగాలి.

– వేములపల్లి వెంకట్రామయ్య

జాతీయ అధ్యక్షులు, ఏఐకెఎంఎస్

(ఖమ్మంలో సెప్టెంబర్ 28, 29, 30 తేదీలలో అఖిల భారత రైతు కూలీ సంఘం 4వ అఖిల భారత మహాసభలు)

Updated Date - Sep 26 , 2026 | 12:55 AM