ఇద్దరు
ABN , Publish Date - Jul 20 , 2026 | 12:45 AM
ఆ ఇద్దరికీ కాసిన్ని నక్షత్రాల్ని దోసిట్లో నింపుకోవాలని ఆశ అహర్నిశలూ శ్రమించి అందమైన...
ఆ ఇద్దరికీ కాసిన్ని నక్షత్రాల్ని
దోసిట్లో నింపుకోవాలని ఆశ
అహర్నిశలూ శ్రమించి
అందమైన రెక్కలు సంపాదించి
ఆకాశం వైపు ఎగిరాడు
ఒకడు
పగలంతా ధ్యానం చేసుకుని
రాత్రి నదిలోంచి తేటనీటిని
దోసిట్లోకి తీసుకున్నాడు
మరొకడు!
మూలా సుబ్రహ్మణ్యం