పశ్చిమాసియా యుద్ధంలో ప్రపంచమే ఓడింది!
ABN , Publish Date - Apr 02 , 2026 | 05:10 AM
అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌తో చేస్తున్న యుద్ధంలో ఆయా దేశాలు, వారి మిత్రదేశాలే కాదు యావత్ ప్రపంచమే పరాజయం పాలవుతుంది. ఇజ్రాయెల్ పంతానికి అమెరికా అహంకారం...
అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌తో చేస్తున్న యుద్ధంలో ఆయా దేశాలు, వారి మిత్రదేశాలే కాదు యావత్ ప్రపంచమే పరాజయం పాలవుతుంది. ఇజ్రాయెల్ పంతానికి అమెరికా అహంకారం తోడవగా, దౌత్యపరమైన చర్చలు సాగుతుండగానే ఇరాన్‌పై దాడి చేసి ముఖ్యనేతల్ని మట్టుపెట్టారు. పెద్ద తలకాయలు లేని ఇరాన్ గందరగోళానికి గురై కాళ్లబేరానికి రాక తప్పదని భావించారు. వారి ఆలోచనలకు భిన్నంగా ఇరాన్ గల్ఫ్‌లో అమెరికా మిత్రదేశాలపై దాడులు తీవ్రం చేసింది. తన అధీనంలోని రవాణా మార్గం– హోర్ముజ్ జలసంధిని మూసివేసింది. ఫలితంగా ప్రపంచ దేశాల ఇంధన భద్రత ప్రమాదంలో పడింది. యుద్ధం మొదలై నెలరోజులు దాటుతున్నా ఇరువైపులా పంతం తగ్గడం లేదు. తమకు వత్తాసు పలకడం లేదంటూ నాటో మిత్ర దేశాలపై అమెరికా అధ్యక్షుడు అలకబూనారు. మరోవైపు అమెరికాలోనే ఆయన యుద్ధ పిపాసకు వ్యతిరేకంగా లక్షలాది మంది రోడ్లెక్కి నిరసన తెలుపుతున్నారు. గౌరవప్రదంగా యుద్ధం నుంచి తప్పుకోవడమెలాగో ఆయనకు అంతుపట్టడం లేదు. కనుకనే రెండువారాల్లో ముగిస్తాం అంటూ కాసేపు, విజయం పొందామని కాసేపు ప్రకటనల్ని గుప్పిస్తున్నారు. దెబ్బతిన్న ఇరాన్ చావోరేవో అన్న స్థితికి చేరింది. ట్రంప్ మాటల్ని నమ్మే స్థితి లేదు. పాకిస్తాన్, చైనాలు ఇరువైపులా సంధి చేస్తామంటూ చర్చలు జరుపుతున్నాయి. భారత్ ప్రస్తుతానికి తెరవెనుక ప్రయత్నాలు, తమ వాణిజ్య అవసరాల్ని జాగ్రత్తగా హేండిల్ చేసుకోవడం తప్ప చేసేదేమీ లేదు. వెరసి ఎటూ తెగని ఈ యుద్ధం ఇప్పటికే ప్రపంచ ఇంధన భద్రతనీ, ఆర్థికాన్నీ దెబ్బ తీసింది. సాగుతున్న కొద్దీ నష్టాలూ పెరుగుతాయి. త్వరగా ముగిసిపోయేలా ప్రపంచదేశాలు వత్తిడి చెయ్యాలి. ఎందుకంటే పరాజయం అందరిదీ.
డి.వి.జి. శంకరరావు
ఇవి కూడా చదవండి..
కాంగ్రెస్ ప్రిన్స్‌కు వందోసారి కూడా ఓటమి ఖాయం: మోదీ
ఎన్డీయే వస్తే తమిళనాడును దక్షిణ ప్రదేశ్‌గా మార్చేస్తారు: స్టాలిన్