మంగళగిరిలో చేనేత గర్జన
ABN , Publish Date - Feb 21 , 2026 | 01:00 AM
కళాత్మకమైన చేనేత వృత్తి, నేడు దారుణమైన కష్టాల్లో కూరుకుపోయి ఉన్నది. ఈ దుస్థితికి కేంద్రం, రాష్ట్రంలో ఏడు దశాబ్దాలకు పైగా పరిపాలించిన వివిధ ప్రభుత్వాలు అనుసరించిన చేనేత వ్యతిరేక, జౌళి పరిశ్రమ అనుకూల విధానాలు, ఆచరణలు కారణం.
కళాత్మకమైన చేనేత వృత్తి, నేడు దారుణమైన కష్టాల్లో కూరుకుపోయి ఉన్నది. ఈ దుస్థితికి కేంద్రం, రాష్ట్రంలో ఏడు దశాబ్దాలకు పైగా పరిపాలించిన వివిధ ప్రభుత్వాలు అనుసరించిన చేనేత వ్యతిరేక, జౌళి పరిశ్రమ అనుకూల విధానాలు, ఆచరణలు కారణం. వార్షిక బడ్జెట్ల కేటాయింపుల్లో చేనేతకు కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయి. చేనేత పరిశ్రమ రక్షణకూ, కార్మికుల జీవనానికీ, మనుగడకూ తోడ్పడే న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వాలు నిరాకరిస్తున్నాయి. ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలను నెరవేర్చడం లేదు.
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో చేనేత రంగానికి రూ.25 వేల కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల కోట్లు కేటాయించాలి. రాష్ట్ర అధినాయకత్వం తమ వాగ్దానం మేరకు– నేతన్నలతో పాటు, చేనేత ఉపవృత్తులు చేసుకునే కార్మికులందరికీ ప్రతి సంవత్సరం రూ.25వేల ఆర్థిక సహకారం అందించాలి. 200 యూనిట్ల వరకూ విద్యుత్‌ను వారికి ఉచితంగా అందించే పథకాన్ని అమలుపరచాలి. సహకార సంఘాలకు ప్రభుత్వం చెల్లించవలసిన రూ.203 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలి. వీటితో పాటు, ఆ సంఘాల్లోని రుణాలనూ రద్దు చేయాలి. చిలప నూలు, పట్టు, రంగులు, రసాయనాలను సబ్సిడీ రేట్లకు సప్లై చేయాలి. వీటితో పాటు చేనేత వస్త్రాలపై జీఎస్టీని రద్దు చేయాలి. నిల్వ ఉన్న చేనేత వస్త్రాలను ప్రభుత్వాలు కొనుగోలు చేయాలి. ప్రకృతి వైపరీత్యాల సందర్భాల్లో నేతన్నలకు రూ.10 వేల ఆర్థిక సహకారం అందించాలి. ఆత్మహత్యలు, ఆకలి చావులతో మృతిచెందిన కార్మిక కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. అర్హులైన వారికి పెన్షన్లు మంజూరు చేయాలి. కేంద్ర ప్రభుత్వం హ్యాండ్లూమ్ బోర్డును పునరుద్ధరించాలి... వంటి డిమాండ్లతో ఫిబ్రవరి 22న ఉదయం 10 గంటలకు ‘చలో మంగళగిరి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.
– ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సంఘాల
ఐక్య కార్యాచరణ కమిటీ