‘కొండపల్లి’ సంస్మరణ సభ
ABN , Publish Date - Apr 12 , 2026 | 12:15 AM
భారత విప్లవోద్యమ చరిత్రలో కొండపల్లి సీతారామయ్య (కెఎస్‌ఆర్)ది ఒక మహత్తర అధ్యాయం. ఆయన మార్క్సిజం, లెనినిజం–మావో ఆలోచనా విధానం వెలుగులో భారతదేశ కమ్యూనిస్టు విప్లవోద్యమాన్ని దిశానిర్దేశం చేశారు.
భారత విప్లవోద్యమ చరిత్రలో కొండపల్లి సీతారామయ్య (కెఎస్‌ఆర్)ది ఒక మహత్తర అధ్యాయం. ఆయన మార్క్సిజం, లెనినిజం–మావో ఆలోచనా విధానం వెలుగులో భారతదేశ కమ్యూనిస్టు విప్లవోద్యమాన్ని దిశానిర్దేశం చేశారు. కెఎస్‌ఆర్ జీవితం ఒక నిరంతర విప్లవ ప్రవాహం, ఆయన సిద్ధాంత, రాజకీయ నాయకత్వం కింద భూమి, భుక్తి పోరాటాలలో ప్రజలు ఎన్నో విజయాలు సాధించారు. భారత విప్లవోద్యమంలో ఆయన పాత్ర చిరస్మరణీయమైనది. కొండపల్లి సీతారామయ్య 24వ వర్ధంతి సందర్భంగా విజయవాడ గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో ఏప్రిల్ 12 ఉదయం పది గంటలకు సంస్మరణ సభ జరుగనున్నది. ఇందులో కొండపల్లి సీతారామయ్య సంపూర్ణ రచనలు మూడవ సంపుటి ఆవిష్కరణ జరుగుతుంది. ఈ సంపుటిలో 1977 ఆగస్టు రాజకీయ తీర్మానం; వ్యవసాయ విప్లవం పాలకవర్గ సంస్కరణల నిజస్వభావం; గ్రామాలకు తరలండి క్యాంపెయిన్ సర్క్యులర్; ఎన్నికల బహిష్కరణ, తప్పులు సరిదిద్దుకుని, సంఘటితపరచి పురోగమిద్దాం క్యాంపెయిన్ సర్క్యులర్ వంటి సిద్ధాంత పత్రాలున్నాయి. ఈ సభలో డా. కె.విజయ్‌కుమార్, అరసవెల్లి కృష్ణ, డానీ, ఆర్.భరద్వాజ్, కొండారెడ్డి, రివెరా, తాళ్లూరి శ్రీనివాసరావు పాల్గొంటారు.
–కొండపల్లి సీతారామయ్య మెమోరియల్ కమిటీ