Share News

కావ్య సృష్టి

ABN , Publish Date - Mar 30 , 2026 | 02:49 AM

ఎప్పటికో ఒక పరిణత వాక్యం అనుకోకుండా దొరుకుతుంది పండిన ఒక పదచిత్రం అప్రయత్నంగా రాలిపడుతుంది.

కావ్య సృష్టి

ఎప్పటికో ఒక పరిణత వాక్యం

అనుకోకుండా దొరుకుతుంది

పండిన ఒక పదచిత్రం

అప్రయత్నంగా రాలిపడుతుంది.

చల్ల చిలికినట్టు మనసు

ఒక లయాత్మక మధనానికి

నవనీత ఫలాన్ని ప్రభవించే పనిని ప్రారంభిస్తుంది.

చుట్టూ మూగిన పొంతన లేని శబ్ద సముదాయం

సుశిక్షితమైన స్వరహారంలా ఒదిగిపోతుంది.

దైనందిన జీవితమనే

తెలుపు నలుపుల చిత్రం

ఒకటొకటిగా రంగులు దిద్దుకుంటుంది.

అంతరంగం కొంతసేపు

బహిరంగ వేదిక మీద

తనను తాను ఆవిష్కరించుకోవటానికి

సిద్ధపడుతుంది.

రెండు రంగులు కలిసి

మూడోరంగుకి ప్రాణం పోసినట్టు

బహిరంతర సంయోగం

ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తుంది.

మొదటి వాక్యం మేలుకొని

శంఖం పూరించితే చాలు

ఆపై వెనువెంటనే ఊహల ఊరేగింపు

అలవోకగా సమకూరుతుంది.

n విన్నకోట రవిశంకర్

rvinnako@yahoo.com

ఈ వార్తలు కూడా చదవండి

పోలీసులపై దాడి.. ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

సీసీ టీవీ కెమెరా వైర్ అనుకుని కేబుల్ వైర్ కట్ చేసింది.. అంతే..

మినాబ్ క్రిమినల్స్ వీళ్లే.. ఫోటోలు విడుదల చేసిన ఇరాన్

Updated Date - Mar 30 , 2026 | 02:49 AM