Share News

‘కవిరాజు’ యువజన సదస్సు

ABN , Publish Date - Sep 13 , 2026 | 07:52 AM

కవిరాజు త్రిపురనేని రామస్వామి తెనాలి మునిసిపల్ ఛైర్మన్‌గా పదవీబాధ్యతలు స్వీకరించి వందేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని అక్టోబర్ 3న తెనాలిలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ‘కవిరాజు’ యువజన సదస్సు నిర్వహించనున్నాం. ఈ సదస్సులో ఆలపాటి రాజేంద్రప్రసాద్, మండలి బుద్ధప్రసాద్, డొక్కా మాణిక్య వరప్రసాద్, హైకోర్టు మాజీ న్యాయమూర్తి..

‘కవిరాజు’ యువజన సదస్సు

కవిరాజు త్రిపురనేని రామస్వామి తెనాలి మునిసిపల్ ఛైర్మన్‌గా పదవీబాధ్యతలు స్వీకరించి వందేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని అక్టోబర్ 3న తెనాలిలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ‘కవిరాజు’ యువజన సదస్సు నిర్వహించనున్నాం. ఈ సదస్సులో ఆలపాటి రాజేంద్రప్రసాద్, మండలి బుద్ధప్రసాద్, డొక్కా మాణిక్య వరప్రసాద్, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జి.రాధారాణి, ముత్తేవి రవీంద్రనాథ్, బి.సాంబశివరావు, కవిరాజు మనుమలు, సాహితీవేత్త అట్లూరి అనిల్, సినీనటుడు త్రిపురనేని సాయిచంద్ తదితరులు పాల్గొంటారు. ఈ సందర్భంగా పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు వేర్వేరుగా ‘కవిరాజు త్రిపురనేని రామస్వామి జీవితం, సాహిత్యం, సామాజిక కృషి ఈ తరం యువతీయువకులకు కూడా ఆదర్శం ఎలా కాగలిగింది?’ అనే అంశంపై వ్యాస రచన పోటీలు నిర్వహించి, ఎంపిక చేసినవారికి అక్టోబర్‌ 3 సదస్సులో నగదు బహుమతులు అందించనున్నాం. కవిరాజు జీవితం, సాహిత్యం, సామాజిక కృషిలో నేటి తరానికి ఉపయోగపడే ఆలోచనలు, స్ఫూర్తిదాయకమైన అంశాలను విద్యార్థులు తమదైన రీతిలో వివరించాలి. వ్యాసాన్ని ఎ4 లేదా ఫూల్‌స్కేప్ సైజు కాగితంపై రెండు పేజీలకు మించకుండా రాసి, ప్రిన్సిపాల్ లేదా ప్రధానోపాధ్యాయుడి అధీకృత పత్రం, అభ్యర్థి పాస్‌ పోర్ట్ సైజు కలర్ ఫొటో జతచేసి, సెప్టెంబర్ 28వ తేదీలోపు కింది చిరునామాకు పంపాలి: ముత్తేవి రవీంద్రనాథ్, (అధ్యక్షులు, విజ్ఞాన వేదిక) 20-–40–-5, మోతాదు వీధి, చినరావూరు, తెనాలి-–522201.

ముత్తేవి రవీంద్రనాథ్‌

Updated Date - Sep 13 , 2026 | 07:52 AM