రచయిత vs. స్టోరీ టెల్లర్
ABN , Publish Date - Oct 12 , 2026 | 03:36 AM
మీకో ప్రధానమైన సమస్య చెబుతాను. అత్యంత ప్రతిభావంతులైన భారత రచయితలు కొందరు ఉన్నారు. రష్దీ కావచ్చు.. నైపాల్ కావచ్చు.. విక్రమ్ సేథ్ కావచ్చు.. వీరి రచనలు చదవటం వల్ల చాలా విషయాలు తెలుస్తాయి.
ప్రస్తుతం ఇంగ్లీషులో రాస్తున్న భారతీయ రచయితలపైన మీ అభిప్రాయమేమిటి?
జెఫ్రీ ఆర్చర్: మీకో ప్రధానమైన సమస్య చెబుతాను. అత్యంత ప్రతిభావంతులైన భారత రచయితలు కొందరు ఉన్నారు. రష్దీ కావచ్చు.. నైపాల్ కావచ్చు.. విక్రమ్ సేథ్ కావచ్చు.. వీరి రచనలు చదవటం వల్ల చాలా విషయాలు తెలుస్తాయి. బావుంటాయి కూడా. అయితే నా దృష్టిలో ఆర్.కె. నారాయణన్ చాలా గొప్ప రచయిత. గొప్ప స్టోరీ టెల్లర్. ఒక చిన్న గ్రామంలో ఉండే టాక్స్ ఇన్‌స్పెక్టర్ గురించి అద్భుతంగా రాయగలడు. ఇప్పుడు మీరు నన్ను రచయితకు, స్టోరీ టెల్లర్‌కు మధ్య ఉన్న తేడా ఏమిటని అడుగుతారు. రష్దీ, నైపాల్, విక్రమ్ సేథ్... వీళ్లందరూ మేధావులు. విక్రమ్ సేథ్‌నే తీసుకోండి. అతను నవలలు రాయగలడు. కవిత్వం రాయగలడు. పెయింటింగ్ వేయగలడు. ఏ పని చేసినా తిరుగులేని విధంగా చేయగలడు. కాని ఆర్.కె. నారాయణన్ పుస్తకం ఏదైనా తీసుకోండి. మొదటి పేజీ చదవండి. రెండో పేజీ దానంతట అదే ముందుకు వెళ్లిపోతుంది. పుస్తకం పూర్తయ్యేదాకా వదలబుద్ధి కాదు. అది స్టోరీ టెల్లర్ గొప్పతనం. ఇది కేవలం దేవుడిచ్చిన వరం. నేర్చుకుంటే వచ్చేది కాదు. ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లిష్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న ప్రొఫెసర్ ఒకరు ఒకసారి నాకు- ప్రతి వెయ్యి మంది రచయితల్లోను ఒకరు మాత్రమే స్టోరీ టెల్లర్ ఉంటారు అని చెప్పారు. అదీ నిష్పత్తి. అంతర్జాతీయ క్రికెట్‌లో చాలా మంది బ్యాట్స్‌మెన్ ఉంటారు. కాని వాళ్లలో సచిన్ ఒక్కడే ప్రత్యేకమైన వ్యక్తి. ఇది కూడా అంతే.
ప్రపంచం చిన్నదయిపోతోంది. అన్ని విషయాలను చిటికలో పట్టుకోగల సామర్థ్యం పాఠకుడికి వచ్చేసింది. అందువల్ల రచయితలు మరింత జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ చెబుతున్నా– రచయితకు, మంచి స్టోరీ టెల్లర్‌కు తేడా ఇక్కడే తెలుస్తుంది.
(ఈ నెల 5వ తేదీన మరణించిన ప్రసిద్ధ నవలా రచయిత జెఫ్రీ ఆర్చర్ 2009లో హైదరాబాద్ వచ్చారు. ఆ సందర్భంగా ఆంధ్రజ్యోతి ‘నవ్య’ పేజీ కోసం సి.వి.ఎల్.ఎన్. ప్రసాద్ చేసిన ఇంటర్వ్యూలోంచి చిన్న భాగం ఇది.)