‘గ్లోబల్ సిటీ’ కావాలంటే...
ABN , Publish Date - Jun 30 , 2026 | 12:02 AM
హైదరాబాద్ నగరం గ్లోబల్ వేదిక కావాలంటే ఇక్కడికి వచ్చే పర్యాటకుడు, నివసించే సామాన్యుడు కడుపు నిండా భోజనం చేసి, ఆరోగ్యంగా బయటకు వస్తాడనే భరోసా కల్పించడం పాలకుల ప్రాథమిక బాధ్యత.
హైదరాబాద్ నగరం గ్లోబల్ వేదిక కావాలంటే ఇక్కడికి వచ్చే పర్యాటకుడు, నివసించే సామాన్యుడు కడుపు నిండా భోజనం చేసి, ఆరోగ్యంగా బయటకు వస్తాడనే భరోసా కల్పించడం పాలకుల ప్రాథమిక బాధ్యత. కానీ, నేడు పరిస్థితి దానికి విరుద్ధంగా ఉంది. అధికారులు దాడులు చేసిన ప్రతిసారీ–గడువు ముగిసిన నిల్వలు, కుళ్ళిన మాంసం, అపరిశుభ్రమైన వంటశాలలు దర్శనమిస్తున్నాయి. ఇదంతా ఒకే రోజులో పుట్టుకొచ్చిన సమస్య కాదు. ఏళ్ల తరబడి వ్యవస్థలో పెనవేసుకుపోయిన అవినీతికి, అధికారుల నిర్లక్ష్యానికి, యజమానుల దురాశకు నిదర్శనం. ఒక హోటల్ నిర్వహణలో నిబంధనలు పాటించకపోతే కేవలం ఒక ‘ఉల్లంఘన’గా చూడకూడదు, ఇది ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నేరం. రాజకీయ రక్షణ, వ్యవస్థలోని లొసుగులు యజమానులకు భయం లేకుండా చేస్తున్నాయి. మన నగరం ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా ఎదగాలంటే, హోటల్ పరిశ్రమలో కఠినమైన ‘ఫుడ్ సేఫ్టీ ఆడిట్’ విధానాన్ని తీసుకురావాలి. మూడుసార్లు నిబంధనలు అతిక్రమించిన హోటల్ లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేసే చట్టాలు తేవాలి.
– పురుషోత్తం నారగౌని