ఆంధ్రపై మరో దెబ్బ ఆర్నబ్ తుఫాను
ABN , Publish Date - Oct 31 , 2026 | 12:54 AM
ఎల్‌నినో ప్రభావంతో పంటలు నష్టపోతున్న ఆంధ్రప్రదేశ్‌పై ఆర్నబ్ తుఫాను విరుచుకుపడి మరింత నష్టం కలుగజేసింది.
ఎల్‌నినో ప్రభావంతో పంటలు నష్టపోతున్న ఆంధ్రప్రదేశ్‌పై ఆర్నబ్ తుఫాను విరుచుకుపడి మరింత నష్టం కలుగజేసింది. ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల్లో వేల ఎకరాల పంటలు నాశనమయ్యాయి. విద్యుత్ స్తంభాలు, మౌలిక వసతులు దెబ్బతిన్నాయి. ఏడుగురి ప్రాణాలు గాలిలో కలిశాయి. గతంలో వచ్చిన తుఫానుల కన్నా ప్రాణ నష్టం తగ్గినా, ఆస్తి నష్టం అపారంగా ఉంది. మళ్ళీ వారం లోగా మరో తుఫాను వచ్చే అవకాశం ఉన్నట్టు వస్తున్న వార్తలు ప్రజల్ని కలవరపెడుతున్నాయి. యంత్రాంగం సన్నద్ధత పరంగా గతంతో పోలిస్తే విపత్తు నిర్వహణ మెరుగ్గా ఉన్నప్పటికీ మరింత సమర్థంగా పనిచేయాల్సి ఉంది. జరిగిన పంట నష్టాన్ని త్వరితంగా బేరీజు వేసి రైతులకు ప్రభుత్వం సాయం అందించాలి. యుద్ధ ప్రాతిపదికన మౌలిక సదుపాయాల్ని పునరుద్ధరించాలి. కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే నిధుల్ని అందించాలి. పదేపదే తుఫానుల బారిన పడుతున్న రాష్ట్రానికి ప్రత్యేక ప్రణాళికలు, సదుపాయాలు కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికల నిర్వహణ పేరుతో జాగుచేయక వెంటనే కార్యరంగంలోకి దిగి, ప్రజలకు అవసరమైన సాయమందించాలి.
- డి.వి.జి. శంకరరావు