మృగాళ్లకు ఉరిశిక్ష విధించాలి
ABN , Publish Date - Apr 15 , 2026 | 04:01 AM
ఇటీవల దేశవ్యాప్తంగా మహిళలపై, ముఖ్యంగా పసిపిల్లలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఈ దుశ్చర్యలకు పాల్పడినవారికి కఠినశిక్షలు పడటం లేదు. దీనిపై అటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు సుప్రీంకోర్టు కానీ సరైన దృష్టి పెట్టడం లేదు.
ఇటీవల దేశవ్యాప్తంగా మహిళలపై, ముఖ్యంగా పసిపిల్లలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఈ దుశ్చర్యలకు పాల్పడినవారికి కఠినశిక్షలు పడటం లేదు. దీనిపై అటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు సుప్రీంకోర్టు కానీ సరైన దృష్టి పెట్టడం లేదు. సాక్ష్యాలు, వాదనలు, వాయిదాలు అంటూ న్యాయస్థానాలు తీర్పు విషయంలో జాప్యం చేస్తున్నాయి. దీంతో అత్యాచారం చేసినవారిని జైల్లో పెట్టి పోషించాల్సి వస్తోంది. శిక్ష తప్పించుకున్న కొందరు మృగాళ్లు సమాజంలో స్వేచ్ఛగా తిరుగుతూ, మరిన్ని అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. మరోవైపు, అత్యాచారానికి గురైన పసివారు జీవితాంతం కోలుకోలేని పరిస్థితి. వారి తల్లిదండ్రులు అనుభవించే మనోవేదన ఎవరూ తీర్చలేనిది. బాలలపై అత్యాచారాలకు పాల్పడేవారు ఉగ్రవాదుల కంటే ప్రమాదకరం. అత్యాచారం జరిగిందని డాక్టర్లు ధ్రువీకరించిన వెంటనే సదరు నిందితులకు కోర్టు ఉరిశిక్ష విధించాలి. ఇది పక్కాగా అమలయ్యేలా సుప్రీంకోర్టు సైతం దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కేంద్ర ప్రభుత్వం కూడా ఇందుకు సంబంధించి కఠిన చట్టం తీసుకురావాలి. తద్వారా సమాజంలో మరింతమంది మానవ మృగాళ్లు తయారు కాకుండా ఉంటారు.
– ముద్దంశెట్టి రమణమూర్తి