‘స్త్రీ శక్తి’ ఎవరి కోసం?!
ABN , Publish Date - Jun 16 , 2026 | 01:15 AM
రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించేందుకు స్ర్తీ శక్తి పథకాన్ని ఏపీఎస్‌ఆర్టీసీ ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టింది...
రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించేందుకు స్ర్తీ శక్తి పథకాన్ని ఏపీఎస్‌ఆర్టీసీ ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టింది. స్త్రీలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి గానీ దుర్వినియోగం చేయకూడదు. ఉచిత బస్సులలో మహిళా ప్రయాణికుల సంఖ్య కూడా ఎక్కువై రద్దీ విపరీతంగా పెరిగిన దరిమిలా సెల్‌ఫోన్లు, ఆభరణాలు, బ్యాగుల తస్కరింపులతో చిల్లర దొంగలకు అవకాశంతో పాటు సీటు కోసం కుస్తీలు, సిగపట్లు, గాయాలు ఎక్కువైపోయాయి. వయోవృద్ధులు, వికలాంగులు బస్సు ఎక్కాలంటే అవస్థలు పడాల్సిందే! నిలబడి ప్రయాణం చేయాల్సిందే. ఆర్టీసీ యాజమాన్యం బస్సుల సంఖ్య పెంచడమో లేక స్ర్తీలకు మాత్రమే ప్రత్యేక బస్సులు కేటాయించడమో చేయాలి. లేదంటే ప్రజల్లో ఉచితం అంటే ‘వద్దు బాబోయ్!’ అనే నిరుత్సాహం కలిగే దుస్థితి ఏర్పడుతుంది.
బీవీ సుబ్బన్న, అనంతపురం