Share News

యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాలకు వేళాయె

ABN , Publish Date - Feb 10 , 2026 | 04:06 AM

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి.

యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాలకు వేళాయె

  • 12 నుంచి 17 వరకు మహాశివరాత్రోత్సవాలు

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ప్రధానాలయంలో 11 రోజుల పాటు పాంచరాత్రాగమ రీతిలో, శివాలయ ఉత్సవాలు పాంచాహ్నిక దీక్షలో నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలు 5రోజుల పాటు కొనసాగనున్నాయి. శివాలయంలో ఈ నెల 12న స్వస్తి వాచనం, అంకురారోపణం, 13న ధ్వజారోహణం, దేవతాహ్వానం, 14న రుద్రహవనం, శివపార్వతుల కల్యాణం, 15న మహాశివరాత్రి, అభిషేకాలు, శతరుద్రాభికాలు, 16న లక్ష బీల్వార్చన, రథోత్సవం, 17న పూర్ణాహుతి, త్రిశూల తీర్థ కార్యక్రమాలతో శివరాత్సోత్సవాలు పరిసమాప్తి అవుతాయి.

Updated Date - Feb 10 , 2026 | 04:06 AM