గుమ్మానికి మామిడి ఆకులు ఎందుకు కడతారో తెలుసా? సైన్స్ ఏం చెబుతోంది..
ABN , Publish Date - Mar 18 , 2026 | 06:48 PM
హిందూ ధర్మం ప్రకారం ఇంటి గుమ్మానికి మామిడి ఆకులు కట్టడం సంప్రదాయం. ఇలా ప్రతీ పండుగకు, శుభకార్యాలకు గుమ్మానికి మామిడి ఆకులు కట్టడం వెనుక సంప్రదాయ కారణాలతో పాటు సైన్స్ కూడా ఉంది.
ఇంటర్‌నెట్ డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు రేపు (గురువారం) తెలుగు సంవత్సరాది ఉగాదిని అత్యంత ఘనంగా జరుపుకోనునున్నారు. ఉగాది పచ్చడి, పిండి వంటలు, పంచాగ శ్రవణంతో హిందువుల గృహాలు కొత్త శోభను సంతరించుకోనున్నాయి. గుమ్మాలు మామిడి తోరణాలతో అందంగా మారనున్నాయి. కేవలం ఉగాది అనే కాదు.. ఏ పండుగ జరిగినా.. శుభకార్యం అయినా.. హిందూ ధర్మం ప్రకారం ఇంటి గుమ్మానికి మామిడి ఆకులు కట్టడం సంప్రదాయం. ఇలా ప్రతీ పండుగకు, శుభకార్యాలకు గుమ్మానికి మామిడి ఆకులు కట్టడం వెనుక సంప్రదాయ కారణాలతో పాటు సైన్స్ కూడా ఉంది.
లక్ష్మీ దేవి కొలువైన ఆకులు..
మామిడి ఆకులలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని హిందువుల నమ్మకం. ఇవి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించి.. ఇంట్లోకి ఐశ్వర్యాన్ని, శ్రేయస్సును తెస్తాయని నమ్ముతారు. దృష్టి దోషాలను నివారిస్తాయన్న నమ్మకం కూడా ఉంది. వినాయకుడు, కుమారస్వామికి మామిడి పండ్లంటే ఇష్టమని, అందుకే ఈ ఆకులను తోరణాలుగా కట్టడం వల్ల దేవతల అనుగ్రహం కలుగుతుందని నమ్మకం. అంతేకాదు.. పురాణాల ప్రకారం మామిడి చెట్టును సృష్టికర్త అయిన బ్రహ్మ దేవునికి అంకితం చేశారు. పచ్చని మామిడి ఆకులు సంతాన ప్రాప్తికి, సుఖ సంతోషాలకు, పంటలు బాగా పండటానికి చిహ్నంగా భావిస్తారు.
సైన్స్ పరంగా..
సైన్స్ ప్రకారం.. మామిడి ఆకులు కోసిన తర్వాత కూడా చాలా సేపు కార్బన్ డయాక్సైడ్‌ను పీల్చుకుని ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. శుభకార్యాల్లో జనం ఎక్కువగా ఉన్నప్పుడు గాలిని శుద్ధి చేయడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. పూర్వం గ్రామాల్లో బావులను శుభ్రం చేసే సమయంలో మామిడాకులను వాడేవారు. మనుషులకంటే ముందు మామిడి ఆకులు ఎక్కువగా ఉన్న ఓ కొమ్మను బావిలోకి వేసేవారు. చుట్టూ కొంతసేపు తిప్పేవారు. ఇలా చేయడం వలన బావిలో ఉన్న విషవాయువులు తొలగిపోతాయని రుజువైంది.
ఇవి కూడా చదవండి
మార్కెట్‌లో కల్తీ నూనె.. ఇలా గుర్తించండి
ల్యాండ్ అవుతూ కుప్పకూలిన హెలికాఫ్టర్.. క్షణాల్లో విధ్వంసం..