17, 19 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు: టీటీడీ
ABN , Publish Date - Mar 12 , 2026 | 03:41 AM
తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలను ఈ నెల 17, 19 తేదీల్లో రద్దు చేస్తున్నట్టు టీటీడీ బుధవారం ప్రకటించింది. శ్రీవారి ఆలయంలో 19వ తేదీన ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు..
తిరుమల, మార్చి 11(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలను ఈ నెల 17, 19 తేదీల్లో రద్దు చేస్తున్నట్టు టీటీడీ బుధవారం ప్రకటించింది. శ్రీవారి ఆలయంలో 19వ తేదీన ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు. అలాగే ఉగాది సందర్భంగా 17న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సామాన్య భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టీటీడీ ఈ రెండు తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను కేవలం ప్రొటోకాల్ పరిధిలోని ప్రముఖులకు మాత్రమే పరిమితం చేసింది. ఈ క్రమంలో 16, 18 తేదీల్లో బ్రేక్ దర్శనాల కోసం ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించబోమని టీటీడీ స్పష్టం చేసింది. ఇక, 17వ తేదీన అష్టదళపాద్మారాధన సేవను కూడా టీటీడీ రద్దు చేసింది.