Share News

టీటీడీ ట్రస్టులకు రూ.1.40 కోట్ల విరాళం

ABN , Publish Date - Feb 11 , 2026 | 03:01 AM

టీటీడీ ట్రస్టులకు మంగళవారం రూ.1.40 కోట్లు విరాళంగా అందాయి. హైదరాబాద్‌కు చెందిన గుత్తా శ్రీహర్షసాయి చౌదరి ఎస్వీ ప్రాణదానం ట్రస్టుకు రూ.కోటి విరాళాన్ని టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడికి అందజేశారు.

టీటీడీ ట్రస్టులకు రూ.1.40 కోట్ల విరాళం

తిరుమల, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): టీటీడీ ట్రస్టులకు మంగళవారం రూ.1.40 కోట్లు విరాళంగా అందాయి. హైదరాబాద్‌కు చెందిన గుత్తా శ్రీహర్షసాయి చౌదరి ఎస్వీ ప్రాణదానం ట్రస్టుకు రూ.కోటి విరాళాన్ని టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడికి అందజేశారు. హైదరాబాద్‌కు చెందిన స్మార్ట్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ మోహన్‌ ఇండస్ర్టీస్‌ ఎండీ యలమంచిలి మదన్మోహనరావు రూ.30 లక్షలు విరాళం అందజేసి అన్నప్రసాదం ట్రస్టుతో పాటు ఇతర ట్రస్టులకు వినియోగించాలని కోరారు. టీటీడీ బోర్డు సభ్యుడు సదాశివరావు ఆయన వెంట ఉన్నారు. గుంటూరుకు చెందిన ఎన్‌.సుధారాణి అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10,01,116 విరాళం డీడీని టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు.

Updated Date - Feb 11 , 2026 | 03:01 AM