Share News

తిరుమలలో వేసవి ఏర్పాట్లు

ABN , Publish Date - Feb 14 , 2026 | 02:38 AM

వేసవిలో శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఉపశమనం కల్పించేలా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లను ప్రారంభించింది.

తిరుమలలో వేసవి ఏర్పాట్లు

  • భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ చర్యలు

తిరుమల, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): వేసవిలో శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఉపశమనం కల్పించేలా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లను ప్రారంభించింది. సాధారణంగా శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు ఎండ కారణంగా ఇబ్బంది కలగకుండా నడిచేందుకు వీలుగా టీటీడీ కూల్‌ పెయింట్‌ వేస్తోంది. అలాగే మాడవీధుల్లో గ్యాలరీ పక్కనే భక్తుల సౌకర్యం కోసం గ్రీన్‌మ్యాట్‌తో పందిళ్లు వేస్తోంది. ప్రస్తుతం తూర్పు మాడవీధిలో ఈ పందిళ్ల నిర్మాణం పూర్తయింది. త్వరలో మిగిలిన ప్రాంతాల్లోనూ ఈ గ్రీన్‌మ్యాట్‌తో పైకప్పును ఏర్పాటు చేయనున్నారు.

Updated Date - Feb 14 , 2026 | 02:38 AM