Share News

నేటి రాశి ఫలాలు.. 30-09-2026

ABN , Publish Date - Sep 30 , 2026 | 12:47 AM

నేటి రాశి ఫలాలు.. 30-09-2026 బుధవారం

నేటి రాశి ఫలాలు.. 30-09-2026
Today Horoscope

01 MESHAM.jpgమేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

ఆరోగ్యం మెరుగుపడుతుంది. లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాల్సి వస్తుంది. విందు వినోదాల్లో పరిమితులు పాటించాలి. కొత్త పనుల ప్రారంభం విషయంలో మీ అంచనాలు ఫలించకపోవచ్చు. శ్రీ రామరక్షా స్తోత్ర పారాయణ శుభప్రదం.


02 VRUSHABHAM.jpgవృషభం ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

పొదుపు పథకాలకు సంబంధించి సమాచారం సేకరిస్తారు. ప్రియతములతో ప్రయాణాలకు అనుకూలం. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలకు అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. చిన్నారులు, ప్రియతముల విషయాలు మనస్తాపానికి గురిచేస్తాయి. మహాగణపతిని ఆరాధించండి.


03 MIDHUNAM.jpgమిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. పెట్టుబడుల విషయంలో కీలక నిర్ణయాలకు అనుకూలం కాదు. బృందకార్యక్రమాల కోసం ఖర్చులు అధికం. రియల్‌ ఎస్టేట్‌ రంగంలోని వారు ఆచితూచి వ్యవహరించాలి. శ్రీ రామచంద్ర మూర్తి ఆరాధన శుభప్రదం.


04 KARKATAM.jpgకర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

పెద్దలతో చర్చలు, సమావేశాలు ఫలిస్తాయి. ఒక సమాచారం కలవరపెడుతుంది. తోబుట్టువుల కారణంగా మాటపడాల్సి వస్తుంది. ఇంటర్వ్యూలలో ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. శ్రీ గణేశ పంచరత్నమాలా పారాయణ శుభప్రదం.


05 SIMHAM.jpgసింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

కళలు, రక్షణ, టెలివిజన్‌ రంగాల వారికి ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో కొత్త ప్రయోగాలకు దూరంగా ఉండటం మంచిది. వేడుకల కోసం ఖర్చులు అంచనాలు మించుతాయి. శ్రీ రామచంద్ర మూర్తి దర్శనం శుభప్రదం.


06 KANYA.jpgకన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాల కారణంగా నష్టపోయే అవకాశం ఉంది. చేపట్టిన పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. ఖర్చులు అధికం. మహాగణపతిని ఆరాధించండి.


07 TULA.jpgతుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

కొత్త పరిచయాలు ఉల్లాసం కలిగిస్తాయి. పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. భాగస్వామి వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. పందాలు, పోటీల్లో నష్టపోయే అవకాశం ఉంది. విష్ణు సహస్రనామ పారాయణ శుభప్రదం.


08 VRUSCHIKAM.jpgవృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపారాల్లో అదనపు ఆదాయం అందుకుంటారు. ఫార్మ, హోటల్‌, రిటైల్‌ రంగాల వారికి ఆర్థిక విషయాల్లో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక విషయాల్లో సన్నిహితులు మొహమాటపెట్టే అవకాశం ఉంది. మహావిష్ణువు ఆరాధన శుభప్రదం.


09 DHANUSU.jpgధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. ఆడిటింగ్‌, క్రీడలు, అడ్వర్టయిజ్‌మెంట్‌ రంగాల వారు మాటపడాల్సి వస్తుంది. చిన్నారులు, ప్రియతముల వైఖరిమనస్తాపం కలిగిస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ శుభప్రదం.


10 MAKARAM.jpgమకరం (డిసెంబరు 22 - జనవరి 20 మధ్య జన్మించిన వారు)

తల్లిదండ్రుల విషయాల్లో శుభపరిణమాలు జరుగుతాయి. వేడుకలు, సమావేశాలకు ఏర్పాట్లలో కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. బదిలీలు, మార్పుల విషయంలో ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. అగ్రిమెంట్ల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. శ్రీ రామ రక్షా స్తోత్ర పారాయణ శుభప్రదం.


11 KUMBHAM.jpgకుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

విద్య, ప్రయాణాలకు అవసరమైన నిధులు సకాలంలో అందుతాయి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తలు పాటించాలి. పెట్టుబడులకు సంబంధించిన చర్చలు ఫలించకపోవచ్చు. విష్ణు అష్టోత్తర శతనామ పారాయణ శుభప్రదం.


12 MEENAM-FINAL.jpgమీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

కొత్త పరిచయాలు లాభిస్తాయి. జనసంబంధాలు విస్తరిస్తాయి. మద్యాహ్నం నుంచి ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. పందాలు, పోటీలకు దూరంగా ఉండటం మేలు. వేడుకల కోసం ఖర్చులు అంచనాలు మించుతాయి. శ్రీ రామచంద్ర మూర్తి దర్శనం శుభప్రదం.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Sep 30 , 2026 | 12:48 AM