Share News

నేటి రాశి ఫలాలు 17-10-2026

ABN , Publish Date - Oct 17 , 2026 | 02:16 AM

నేటి రాశి ఫలాలు 17-10-2026 శనివారం

నేటి రాశి ఫలాలు 17-10-2026
RashiPhalalu

01 MESHAM.jpgమేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

వివాహ నిర్ణయాల్లో పెద్దల సలహా మేరకు నడుచుకోవడం మంచిది. సమావేశాల్లో గౌరవ, మన్ననలు అందుకుంటారు. ఉన్నత పదవులు అందుకుంటారు. లక్ష్య సాధనలో భాగస్వామి సహకారం లభిస్తుంది.


02 VRUSHABHAM.jpg

వృషభం (ఏప్రిల్‌ 21- మే20 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగపరమైన సమావేశాలు, చర్చలకు అనుకూలం. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సంకల్పం నెరవేరుతుంది.


03 MIDHUNAM.jpgమిథునం (మే 21 - జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. చిన్నారులు, ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులు లాభిస్తాయి. పన్నులు, పెన్షన్‌, బీమా వ్యవహారాలకు అనుకూలం.


04 KARKATAM.jpgకర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. ప్రియతముల కలయికతో ఇల్లు సందడిగా ఉంటుంది. స్థిరాస్త రంగంలోని వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు..


05 SIMHAM.jpgసింహం (జూలై 24-ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. సహోద్యోగులతో చర్చలు ఫలిస్తాయి. పరిశ్రమలు, వ్యవసాయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.


06 KANYA.jpgకన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. పొదుపు పథకాలపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. ఆడిటింగ్‌, అడ్వర్టయిజ్‌మెంట్‌, విద్య, క్రీడల రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది.


07 TULA.jpgతుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

బదిలీలు, స్థల మార్పులకు సంబంధించి ఒక నిర్ణయానికి వస్తారు. కుటుంబ సభ్యుల వైఖరి ఆనందం కలిగిస్తుంది. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు కొత్త ఆలోచనలు అమలు చేసి విజయం సాధిస్తారు.


08 VRUSCHIKAM.jpgవృశ్చికం (అక్టోబరు 24-నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. శుభవార్త అందుకుంటారు. ప్రయాణాలు, చర్చలు ఫలిస్తాయి. విద్యా సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. సన్నిహితులకు సంబంధించిన రహస్య సమాచారం తెలుసుకుంటారు


09 DHANUSU.jpgధనుస్సు (నవంబరు 23-డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. డిపాజిట్లు, పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థికపరమైన సమావేశాలు ఫలిస్తాయి.


10 MAKARAM.jpgమకరం (డిసెంబరు 21-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. తల్లిదండ్రుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. ప్రముఖులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు.


11 KUMBHAM.jpgకుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

విద్యా సంస్థల్లో ప్రవేశానికి అనుకూలం. బంధుమిత్రులతో చర్చలు ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. ప్రచురణ, బోధన, రవాణా, ఎగుమతులు, ఉన్నత విద్యా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. శుభవార్త అందుకుంటారు.


12 MEENAM-FINAL.jpgమీనం (ఫిబ్రవరి 20-మార్చి20 మధ్య జన్మించిన వారు)

విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. సన్నిహితుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. సంకల్పం నెరవేరుతుంది.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Oct 17 , 2026 | 02:35 AM