నేటి రాశి ఫలాలు.. 08-09-2026
ABN , Publish Date - Sep 08 , 2026 | 12:32 AM
నేటి రాశి ఫలాలు.. 08-09-2026 (మంగళవారం)

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
అన్ని విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించకపోవడంతో నిరుత్సాహానికి గురవుతారు. మధ్యాహ్నం తరువాత బంధుమిత్రులను కలుసుకుంటారు. చిన్నారులు, ప్రియతముల విషయంలో శుభపరిణామాలు సంభవం. సినిమాలు, టెలివిజన్, క్రీడలు, విద్యా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది

వృషభం (ఏప్రిల్ 22 - మే 20 మధ్య జన్మించిన వారు)
రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మధ్యాహ్నం తరువాత కుటుంబ సభ్యుల వైఖరి ఆనందం కలిగిస్తుంది. వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. మార్పులకు అనుకూలమైన రోజు.

మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
స్థిర, చరాస్తులకు సంబంధించిన చర్చల్లో నిదానం పాటించాలి. వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. మధ్యాహ్నం తరువాత రవాణా, మార్కెటింగ్, కమ్యూనికేషన్లు, కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం. బంధుమిత్రులతో చర్చలు, ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి.

కర్కాటకం (జూన్ 22-జూలై 23 మధ్య జన్మించిన వారు)
విలువైన పత్రాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మధ్యాహ్నం తరువాత విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులు లాభిస్తాయి. ఆర్థిక పరమైన చర్చలకు అనుకూలం. తోబుట్టువులు, బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది.

సింహం (జూలై 24-ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక సంస్థలతో పనులకు కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. మధ్యాహ్నం తరువాత బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. వేడుకలు ఆనందం కలిగిస్తాయి. పెట్టుబడులకు సంబంధించి ఒక నిర్ణయానికి వస్తారు.

కన్య (ఆగస్టు 23-సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మధ్యాహ్నం తరువాత వేడుకలు, బృందకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాలకు అనుకూల సమయం. సినీ, రాజకీయ రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక వ్యవహారాల్లో అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. మధ్యాహ్నం తరువాత వేడుకలు, సమావేశాల్లో కీలక పాత్ర పోషిస్తారు. గతించిన వ్యక్తులను స్మరించుకుంటారు. దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి పెడతారు.

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
బృందకార్యక్రమాలకు ఖర్చులు అధికం. సమావేశాల్లో మాటపడాల్సి వస్తుంది. మధ్యాహ్నం తరువాత వేడుకల్లో పెద్దలను కలుసుకుంటారు. గౌరవ పదవులు అందుకుంటారు. పెద్దల సహకరారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు.

ధనుస్సు (నవంబరు 23-డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
బృందకార్యక్రమాల్లో కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. మధ్యాహ్నం తరువాత వేడుకలు ఆనందం కలిగిస్తాయి. పెద్దలతో చర్చలు, ప్రయాణాలు ఫలిస్తాయి. ఉన్నత విద్య, రక్షణ, న్యాయ, రవాణా రంగాల వారు వృత్తి, వ్యాపారాల్లో రాణిస్తారు.

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో బంధుమిత్రుల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటారు. మధ్యాహ్నం తరువాత పెద్దలను స్మరించుకుంటారు. వేడుకల్లో పాల్గొంటారు. పెట్టుబడులకు సంబంధించిన చర్చలకు అనుకూలం. దానధర్మాలు చేస్తారు. వైద్య సేవల కోసం అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి.

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
బంధుమిత్రుల నుంచి మాటపడాల్సి రావచ్చు. మధ్యాహ్నం తరువాత బృందకార్యక్రమాలు, వేడుకలు ఆనందం కలిగిస్తాయి. ఆర్థిక విషయాల్లో శ్రీవారు, శ్రీమతి సహకారం లభిస్తుంది. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి.

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఖర్చులు అధికం. మధ్యాహ్నం నుంచి విందు వినోదాలు ఆనందం కలిగిస్తాయి. బంధుమిత్రుల కలయిక ఉల్లాసం కలిగిస్తుంది. శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు.
- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ