Share News

ఈ రాశి వారికి గుడ్ న్యూస్ అదృష్టయోగం బలంగా ఉంది

ABN , Publish Date - Mar 31 , 2026 | 01:07 AM

నేడు రాశిఫలాలు 31-3-2026 - మంగళవారం, హోటల్‌, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలకు సంబంధించిన వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.

ఈ రాశి వారికి గుడ్ న్యూస్ అదృష్టయోగం బలంగా ఉంది

నేడు రాశిఫలాలు 31-3-2026 - మంగళవారం, హోటల్‌, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలకు సంబంధించిన వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.

01 MESHAM.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

హోటల్‌, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలకు సంబంధించిన వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సహోద్యోగుల ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాల్సి రావచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చేపించాలి. సుబ్రహ్మణ్య అష్టోత్తర స్తోత్ర పారాయణ శుభ ప్రదం.


02 VRUSHABHAM.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో చిన్నారులు, ప్రియతముల వైఖరి ఆనందం కలిగిస్తుంది. సినిమా, టె లివిజన్‌ క్రీడలు, పాఠశాలల రంగాల వారికి ఆర్థిక విషయాల్లో నిదానం పాటించాలి. వేడుకల్లో ఖర్చులు అధికం. గోమాతను సేవించండి.


03 MIDHUNAM.jpg

మిథునం ( మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

ఇంట్లో వేడుకలు, సమావేశాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. బదిలీలు, మార్పులు అసౌకర్యం కలిగిస్తాయి. భూమి లావాదేవీలు, నిర్మాణ రంగాల వారి పెద్దల సలహా తీసుకోవడం మంచిది. ఉద్యోగ, వ్యాపార విస్తరణ విషయాల్లో ఆటంకాలు తప్పకపోవచ్చు. ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.


04 KARKATAM.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

ప్రయాణాలు, చర్చలకు అనుకూలం. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. ఒక సమాచారం ఆవేదన కలిగిస్తుంది. కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తర నామ పారాయణ శుభప్రదం.


05 SIMHAM.jpg

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. అదనపు ఆదాయం అందుకుంటారు. పెట్టుబడులు, పొదుపు పథకాలకు సంబంధించిన నిర్ణయాల్లో తొదరపాటు తగదు. నిధులు సకాలంలో చేతికి అందకపోవచ్చు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శుభప్రదం.


06 KANYA.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

భాగస్వామి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. ముఖ్యమైన విషయాల్లో సన్నిహితులతో చర్చించి ఒక నిర్ణయానికి రావడం మంచిది. వేడుకలు, సమావేశాల్లో ఖర్చులు అధికం. పందాలు, పోటీల్లో నిదానం పాటించండి. హనుమాన్‌ చాలీసా పారాయణ శుభప్రదం.


07 TULA.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

సినిమాలు, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రయాణాలు, చర్చల్లో నిదానం అవసరం. విదేశీ ప్రయాణాలు, ఉద్యోగ ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. సుబ్రహ్మణ్య అష్టక పారాయణ శుభప్రదం.


08 VRUSCHIKAM.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. చిన్నారుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించ కపోవడంతో నిరుత్సాహానికి లోనవుతారు. ఆడిటింగ్‌, పాఠశాలలు, క్రీడాసంస్థలు, ప్రకటన రంగాల వారు నిదానం పాటించాలి. గోసేవ శుభప్రదం.


09 DHANUSU.jpg

ధనుస్పు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

బదిలీలు, మార్పులకు అనుకూలం. పెద్దలు, పై అధికారుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. ప్రభుత్వ సంస్థలతో పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.


10 MAKARAM.jpg

మకరం (డిసెంబరు 22- జనవరి 20 మధ్య జన్మించిన వారు)

విద్యార్థులు పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు, చర్చలు, ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. దూరంలో ఉన్న బంధుమిత్రుల నుంచి ఒక సమాచారం ఆవేదన కలిగిస్తుంది. వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించండి.


11 KUMBHAM.jpg

కుంభం (జనవరి 21-ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. రుణ ప్రయత్నాలు పలిస్తాయి. వైద్య సేవలకు ఖర్చులు అధికం. పెన్షన్‌, మూచ్యువల్‌ ఫండ్స్‌ వ్యవ హారాలు పూర్తవుతాయి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. గోమాత ఆరాధన శుభప్రదం.


12 MEENAM-FINAL.jpg

మీనం (ఫిబ్రవరి 20- మార్చి 20 మధ్య జన్మించిన వారు)

భాగస్వామి వైఖరి ఆనందం కలిగిస్తుంది. ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. జనసంబంధాలు విస్తరిస్తాయి. వేడుకల్లో ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంది. పందాలు, పోటీల్లో నిదానం అవసరం. ఆంజనేయ స్వామి దర్శనం శుభప్రదం.

Updated Date - Mar 31 , 2026 | 01:07 AM