Share News

ఈ రాశి వారికి గుడ్ న్యూస్ కోరుకున్న ఫలితాలు లభిస్తాయి

ABN , Publish Date - Mar 25 , 2026 | 02:57 AM

నేడు రాశిఫలాలు 25-3-2026 - బుధవారం, కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు లాభిస్తాయి. ఒక సమాచారం అనందం కలిగిస్తుంది. ప్రయాణాలు, చర్చలు లాభిస్తాయి.

ఈ రాశి వారికి గుడ్ న్యూస్ కోరుకున్న ఫలితాలు లభిస్తాయి

నేడు రాశిఫలాలు 25-3-2026 - బుధవారం, కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు లాభిస్తాయి. ఒక సమాచారం అనందం కలిగిస్తుంది. ప్రయాణాలు, చర్చలు లాభిస్తాయి.

01 MESHAM.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు లాభిస్తాయి. ఒక సమాచారం అనందం కలిగిస్తుంది. ప్రయాణాలు, చర్చలు లాభిస్తాయి. విద్యార్థులకు అనుకూలమైన రోజు. తోబుట్టువుల విషయంలో శుభపరిణామాలు జరుగతాయి. మధ్యాహ్నం 2 గంటల తరువాత ప్రయాణాల్లో నిదానం అవసరం.


02 VRUSHABHAM.jpg

వృషభం (ఏప్రిల్‌ 21- మే 20 మధ్య జన్మించిన వారు)

బకాయిలు వసూలవుతాయి. దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి సారించి లాభాలు గడిస్తారు. షాపింగ్‌ ఉల్లాసం కలిగిస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మధ్యాహ్నం తరువాత అనవసర ఖర్చులు అధికం.


03 MIDHUNAM.jpg

మిథునం (మే 21 - జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

పదిమందికి ఉపయోగపడే పనులు చేపడతారు. సహకారం సంఘాలు, యూనియన్‌ కార్యకలాపాల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాకు సంబంధించి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మధ్యాహ్నం తరువాత విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి.


04 KARKATAM.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

ప్రముఖులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. వేడుకల్లో పెద్దలను కలుసుకుంటారు. మధ్యాహ్నం తరువాత రాజకీయ, సినీ రంగాల వారు జాగ్రత్తలు పాటించాలి.


05 SIMHAM.jpg

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

బంధుమిత్రుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. సమావేశాలు, బృందకార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి. ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. మధ్యాహ్నం తరువాత ఆర్థికపరమైన చర్చలు ఫలించకపోవచ్చు. సన్నిహితుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది.


06 KANYA.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

గతంలో చేసిన శ్రమకు ఫలితం లభిస్తుంది. పూర్వ మిత్రులను కలుసుకుంటారు. వేడుకల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. మధ్యాహ్నం తరువాత పెద్దల ఆరోగ్యం కలవరపెడుతుంది. శ్రీ రామచంద్ర మూర్తిని ఆరాధించండి.


07 TULA.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

సంకల్ప సాధనలో బంధుమిత్రుల సహకారం అందుకుంటారు. సన్నిహితులతో ప్రయాణాలు, చర్చలకు అనుకూలమైన రోజు. కొత్త అనుబంధాలు ఏర్పడతాయి. మధ్యాహ్నం తరువాత న్యాయ, బోధన, రక్షణ రంగాల వారు జాగ్రత్తలు పాటించాలి. కోర్టు వ్యవహారాలు బాధిస్తాయి. గణపతిని ఆరాధించండి.


08 VRUSCHIKAM.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

వర్తకులు, వడ్డీ వ్యాపారులు, బ్యాంకులు, ఆర్థిక సంస్థల వారికి కొంత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మధ్యాహ్నం తరువాత ఆహారపానీయాల్లో నియామాలుపాటించాలి. ఆర్థిక నష్టం సంభవం. శ్రీ రామచంద్ర మూర్తిని ఆరాధించడం వల్ల మేలు జరుగతుంది.


09 DHANUSU.jpg

ధనుస్సు (నవంబరు 23-డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

అనుబంధాలు బలపడతాయి. చిన్నారుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వివాహ నిర్ణయాలకు అనుకూల సమయం. మధ్యాహ్నం తరువాత పోటీలు, పందాలు, ట్రేడింగ్‌లలో నష్టాలు వచ్చే అవకాశం ఉంది. గణపతిని ఆరాధించండి.


10 MAKARAM.jpg

మకరం (డిసెంబరు 21-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

వేడుకల్లో పాల్గొంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. బదిలీలు, మార్పులకు అనుకూలం. ఉద్యోగ, వ్యాపారాల్లో తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. మధ్యాహ్న తరువాత కేటరింగ్‌, సేవలు, ఫార్మా రంగాల వారు ఇబ్బందులు ఎదుర్కొంటారు. శ్రీ రామచంద్ర మూర్తిని ఆరాధిచండి.


11 KUMBHAM.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

బంధువులను కలుసుకుంటారు. వాట్సాప్‌ సందేశాలు, మెయిల్స్‌ అనందం కలిగిస్తాయి. ప్రియతముల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. మధ్యాహ్నం తరువాత టెలివిజన్‌, ప్రకటనలు, చిట్‌ఫండ్‌లు, విద్యాసంస్థల వారు జాగ్రత్తలు పాటించాలి. మహాగణపతిని ఆరాధించండి.


12 MEENAM-FINAL.jpg

మీనం (ఫిబ్రవరి 20-మార్చి20 మధ్య జన్మించిన వారు)

రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారికి ఆర్థిక విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడుల విషయంలో కుటుంబ సభ్యుల సహకారంతో ముందడుగు వేస్తారు. మధ్యాహ్నం తరువాత మార్పులు అసౌకర్యం కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల వైఖరి బాధిస్తుంది. శ్రీరామచంద్ర మూర్తిని ఆరాధించండి.

Updated Date - Mar 25 , 2026 | 02:57 AM