Share News

Today Horoscope: ఈ రాశి వారికి ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది

ABN , Publish Date - Jan 09 , 2026 | 04:07 AM

నేడు రాశిఫలాలు 9-1- 2026 - శుక్రవారం, శ్రీవారు, శ్రీమతి వైఖరి ఆనందం కలిగస్తుంది. పెట్టుబడులపై ఒక నిర్ణయం తీసుకుంటారు. స్పెక్యులేషన్లు, పందాలు, పోటీలు లాభిస్తాయి...

Today Horoscope: ఈ రాశి వారికి ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది

నేడు రాశిఫలాలు 9-1- 2026 - శుక్రవారం, శ్రీవారు, శ్రీమతి వైఖరి ఆనందం కలిగస్తుంది. పెట్టుబడులపై ఒక నిర్ణయం తీసుకుంటారు. స్పెక్యులేషన్లు, పందాలు, పోటీలు లాభిస్తాయి...

01 MESHAM.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

శ్రీవారు, శ్రీమతి వైఖరి ఆనందం కలిగస్తుంది. పెట్టుబడులపై ఒక నిర్ణయం తీసుకుంటారు. స్పెక్యులేషన్లు, పందాలు, పోటీలు లాభిస్తాయి. సమావేశాల్లో సత్ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. శ్రీ లలితా సహస్రనామ పారాయణ శుభప్రదం.


02 VRUSHABHAM.jpg

వృషభం (ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. లక్ష్య సాధనలో సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఆహారం విషయంలో పరిమితి పాటించండి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కనకధారా స్తోత్ర పారాయణ శుభప్రదం.


03 MIDHUNAM.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్నారుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. షాపింగ్‌ ఉల్లాసం కలిగిస్తుంది. సౌందర్య లహరీ పారాయణ శుభప్రదం.


04 KARKATAM.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

గృహ నిర్మాణం, స్థలసేకరణకు అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల వైఖరి ఆనందం కలిగిస్తుంది. బదిలీలు, మార్పులకు అనుకూలమైన రోజు. లక్ష్మీదేవి ఆరాధన శుభప్రదం.


05 SIMHAM.jpg

సింహం ( జూలై 24-ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

మార్కెటింగ్‌, రవాణా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృత్తిపరమైన చర్చలు, ప్రయాణాలకు అనుకూలం. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు ఫలిస్తాయి. లక్ష్య సాధనలో సన్నిహితుల సహకారం లభిస్తుంది. శ్రీ లలితా సహస్ర నామ పారాయణ శుభప్రదం.


06 KANYA.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఫీజులు, బిల్లుల చెల్లించేందుకు అవసరమైన నిధులు సకాలంలో సర్దుబాటు అవుతాయి. పందాలు, పోటీల్లో విజయం సాఽధిస్తారు. దుర్గామాతను ఆరాధించండి.


07 TULA.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

మార్పులు, బదిలీల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల వైఖరి ఆనందం కలిగిస్తుంది. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. తల్లిందండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. లలితాదేవిని ఆరాధించండి.


08 VRUSCHIKAM.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

వీసా, పాస్‌పోర్ట్‌ వ్యవహారాల్లో, విదేశీ విద్య కోసం చే సే ప్రయత్నాలకు ఫలిస్తాయి. ఒక సమాచారం ఆనందం కలిగిస్తుంది. వాహనం కొనుగోలుకు అనుకూలం. దూర ప్రాంతంలో ఉన్న బంధుమిత్రులను కలుసుకుంటారు. దుర్గాష్టకపారాయణ శుభప్రదం.


09 DHANUSU.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. శ్రీ లలితా సహస్రనామ పారాయణ శుభప్రదం.


10 MAKARAM.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. గౌరవ ప్రతిష్ఠలు పెంపొందుతాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పైఅధికారుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. శ్రీ కనకధారా స్తోత్ర పారాయణ శుభప్రదం.


11 KUMBHAM.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

బంధుమిత్రుల వైఖరి ఆనందం కలిగిస్తుంది. అంచనాలు ఫలిస్తాయి. రాజకీయాలు, ప్రచురణలు, న్యాయ, బోధన, రవాణా, సాంస్కృతిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. దూర ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. లక్ష్యాలు సాధిస్తారు. గాయత్రీ మాతను ఆరాధించండి.


12 MEENAM-FINAL.jpg

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడులపై ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వారసత్వ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. రాజకీయ, సినీరంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉన్నత విద్యకు అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి. లలితా దేవిని ఆరాధించండి.

Updated Date - Jan 09 , 2026 | 04:07 AM