Share News

Today Horoscope: ఈ రాశి వారికి పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి

ABN , Publish Date - Jan 10 , 2026 | 04:12 AM

నేడు రాశిఫలాలు 10-1- 2026 - శనివారం, పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. సమావేశాలు, వేడుకలకు ఖర్చులు అధికం...

Today Horoscope: ఈ రాశి వారికి పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి

నేడు రాశిఫలాలు 10-1- 2026 - శనివారం, పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. సమావేశాలు, వేడుకలకు ఖర్చులు అధికం...

01 MESHAM.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. సమావేశాలు, వేడుకలకు ఖర్చులు అధికం. బృందకార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తారు. ప్రభుత్వరంగ సంస్థలతో పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. సంకల్ప సాధనకు అధికంగా శ్రమించాలి. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించండి.


02 VRUSHABHAM.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

సహోద్యోగుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. హోటల్‌, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారు నిదానం పాటించాలి. విందు వినోదాలకు ఖర్చులు అధికం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. లక్ష్య సాధనకు ఆటంకాలు ఎదురవుతాయి. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ శుభప్రదం.


03 MIDHUNAM.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

చిన్నారులు, ప్రియతముల కోసం ఖర్చులు అధికం. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. విద్య కోసం అవసరమైన నిధులు సకాలంలో అందకపోవచ్చు. సన్నిహితుల ఆరోగ్యం కలవరపెడుతుంది. శ్రీ వేంకటేశ్వర వజ్రకవచ పారాయణ శుభప్రదం.


04 KARKATAM.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

భాగస్వామి వైఖరి ఆవేదన కలిగిస్తుంది. ఖర్చులు అంచనాలు మించుతాయి. కుటుంబ సభ్యులతో వేడుకల్లో పాల్గొంటారు. జనసంబంధాలు విస్తరిస్తాయి. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించండి.


05 SIMHAM.jpg

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

ఒక సమాచారం కలవరపెడుతుంది. కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.. ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించిన చర్చలు, ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. సహోద్యోగులతో ఆనందంగా గడుపుతారు. మహావిష్ణువును ఆరాధించండి.


06 KANYA.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చులు అధికం. పెట్టుబడుల విషయంలో నిదానం అవసరం. చిన్నారులు ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. టెలివిజన్‌, విద్య, ఆడ్వర్టయిజ్‌మెంట్‌ రంగాల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. గోసేవ మేలు చేస్తుంది.


07 TULA.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

స్థిరాస్తి వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సభ్యుల వైఖరిలో మార్పు గమనిస్తారు. మీ మనసు మార్పును కోరుకుంటుంది. బదిలీలు, మార్పులు అసౌకర్యం కలిగిస్తాయి. ఇంటికి అవసరమైన వస్తువుల కొనుగోలులో నాణ్యత గమనించాలి. శ్రీ వేంకటేశ్వర స్వామి స్తోత్ర పారాయణ శుభప్రదం.


08 VRUSCHIKAM.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

సినీ, రాజకీయ రంగాల వారు అప్రమత్తంగా ఉండాలి. ఉన్నత విద్యా ప్రయత్నాలకు అవరోధాలు కలుగుతాయి. ఒక సమాచారం ఆవేదన కలిగస్తుంది. విద్యాసంస్థలతో పనులు పూర్తవుతాయి. ప్రయాణాలు, చర్చలకు అనుకూలమైన రోజు. శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచ పారాయణ శుభప్రదం.


09 DHANUSU.jpg

ధనుస్సు ( నవంబరు 23 - డిసెంబరు 22 మధ్య జన్మించిన వారు)

ఖర్చులు అంచనాలు మించుతాయి. విలువైన వస్తువులు కోల్పోయే ప్రమాదం ఉంది. పెట్టుబడులపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. రుణ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. మహావిష్ణువును ఆరాధించండి.


10 MAKARAM.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపారాల్లో కీలక నిర్ణయాలకు తగిన సమయం కాదు. కొత్త వ్యూహాలు అమలును ఈ రోజుకు వాయిదా వేయడం మంచిది. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ తీసుకోవాలి. గౌరవ మర్యాదలకు భంగం కలిగే అవకాశం ఉంది. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.


11 KUMBHAM.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

మనసు చికాకుగా ఉంటుంది. ఏ విషయం మీద దృష్టి కేంద్రీకరించలేకపోతారు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు, చర్చల్లో జాగ్రత్తలు పాటించాలి. బంధుమిత్రులతో ఆనందం గడుపుతారు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయాణ శుభప్రదం.


12 MEENAM-FINAL.jpg

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక సంస్థలతో పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. పెట్టుబడులు, పొదుపు పథకాల విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సకాలంలో డబ్బు చేతికి అందకపోవచ్చు. ఆర్థిక విషయాల్లో లక్ష్య సాధనకు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచ పారాయణ శుభప్రదం.

Updated Date - Jan 10 , 2026 | 04:12 AM