ఈ రాశి వారికి గుడ్ న్యూస్, జీవితంలో శుభకాలం ప్రారంభం
ABN , Publish Date - Feb 27 , 2026 | 12:00 AM
నేడు రాశిఫలాలు 27-2-2026 - శుక్రవారం,గృహారంభ, ప్రవేశాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు....
నేడు రాశిఫలాలు 27-2-2026 - శుక్రవారం,గృహారంభ, ప్రవేశాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు.

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
గృహారంభ, ప్రవేశాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. బదిలీలు, మార్పులకు సంబఽంధించిన అంశాలను సమీక్షించుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు.

వృషభం (ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
తోబుట్టువులతో ఆనందంగా గడుపుతారు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. ప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. బృందకార్యక్రమాలు ఉల్లాసం కలిగిస్తాయి.

మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. కొత్త వ్యూహాలను అమలు చేసి ఆర్థికంగా విజయం సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. సకాలంలో నిధులు సర్దుబాటు అవుతాయి.

కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
విదేశీ పర్యటనలకు ఏర్పాట్లు చేసుకుంటారు. ప్రయాణాలు, చర్చలకు అనుకూలమైన రోజు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు మనసుకు ఆనందం కలిగిస్తాయి. రాజకీయ, సినీరంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.

సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
వేడుకలు ఆనందం కలిగిస్తాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. ఆర్థిక విషయాల్లో లక్ష్యాలు సాధిస్తారు.

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
సమావేశాల్లో ప్రముఖులను కలుసుకుంటారు. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. పదిమందిని కలుపుకుని మంచి కార్యక్రమాలు చేపడతారు. భాగస్వామి సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు.

తుల (సెప్టెంబరు 24-అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు అమలు చేసి విజయం సాధిస్తారు. ప్రభుత్వ రంగ సంస్థలతో పనులు పూర్తవుతాయి. విందులు, వేడుకల్లో పెద్దలను కలుసుకుంటారు. మీ గౌరవ ప్రతిష్ఠలు పెంపొందుతాయి.

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
చిన్నారులు, ప్రియతములతో ప్రయాణాలు, చర్చలు ఆనందం కలిగిస్తాయి. ఉన్నత విద్య, విదే శీ ప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. వ్యూహాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. సమావేశాలు, ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి.

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
గృహరుణాలు మంజూరవుతాయి. వారసత్వ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆర్థిక సమీక్షలకు అనుకూలం.

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
ప్రియతములతో చర్చలు, ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. పెట్టుబడులకు సంబంధించిన లావాదేవీలకు అనుకూలం. తోబుట్టువుల విషయంలో శుభపరిణామాలు సంభవం. జనసంబంధాలు విస్తరిస్తాయి. ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
వైద్య, పరిశ్రమాలు, వ్యవసాయం, ఫార్మా, హోటల్ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. విందు వినోదాలు ఉల్లాసం కలిగిస్తాయి. కనకధారా స్తోత్ర పారాయణ శుభప్రదం.

మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
సినిమా, టెలివిజన్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీలోని సృజనాత్మకతకు గుర్తింపు లభిస్తుంది. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. విద్యా విషయాల్లో చిన్నారులు విజయం సాధిస్తారు.