ఈ రాశి వారికి గుడ్ న్యూస్, కష్టాల నుంచి విముక్తి
ABN , Publish Date - Feb 14 , 2026 | 02:02 AM
నేడు రాశిఫలాలు 14-2-2026 - శనివారం, సమావేశాలు, వేడుకల్లో పెద్దలను కలుసుకుంటారు. గౌరవ పదవులు అందుకుంటారు.
నేడు రాశిఫలాలు 14-2-2026 - శనివారం, సమావేశాలు, వేడుకల్లో పెద్దలను కలుసుకుంటారు. గౌరవ పదవులు అందుకుంటారు.

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
సమావేశాలు, వేడుకల్లో పెద్దలను కలుసుకుంటారు. గౌరవ పదవులు అందుకుంటారు. పెద్దల సహకరారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. బృందకార్యక్రమాలకు ఖర్చులు అధికం. శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచ పారాయణ శుభప్రదం.

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
సమావేశాలు, వేడుకల్లో పెద్దలను కలుసుకుంటారు. గౌరవ పదవులు అందుకుంటారు. పెద్దల సహకరారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. బృందకార్యక్రమాలకు ఖర్చులు అధికం. శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచ పారాయణ శుభప్రదం.

మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
పెద్దలను స్మరించుకుంటారు. వేడుకల్లో పాల్గొంటారు. పెట్టుబడులకు సంబంధించిన చర్చలకు అనుకూలం. దానధర్మాలు చేస్తారు. వైద్య సేవల కోసం అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి. ఆర్థిక విషయాల్లో బంధుమిత్రుల సహకారం లోపిస్తుంది. గోసేవ శుభప్రదం.

కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
బృందకార్యక్రమాలు, వేడుకలు ఆనందం కలిగిస్తాయి. ఆర్థిక విషయాల్లో శ్రీవారు, శ్రీమతి సహకారం లభిస్తుంది. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. నిధుల విషయంలో బంధుమిత్రుల నుంచి మాటపడాల్సి రావచ్చు. పందాలు, పోటీల్లో జాగ్రత ్తలు తీసుకోవాలి. దానధర్మాలు, సేవా కార్యక్రమాలు శుభప్రదం.

సింహం (జూలై 24-ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
విందు వినోదాలు ఆనందం కలిగిస్తాయి. బంధుమిత్రుల కలయిక ఉల్లాసం కలిగిస్తుంది. శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఖర్చులు అధికం. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
బంధుమిత్రులను కలుసుకుంటారు. చిన్నారులు, ప్రియతముల విషయంలో శుభపరిణామాలు సంభవం. సినిమాలు, టెలివిజన్, క్రీడలు, విద్యా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆచితూచి వ్యవహరించాలి. మీ సృజనాత్మక ప్రతిభకు తగిన గుర్తింపు లభించకపోవడంతో నిరుత్సాహానికి గురవుతారు. గోసేవ శుభప్రదం.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
కుటుంబ సభ్యుల వైఖరి ఆనందం కలిగిస్తుంది. వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. మార్పులకు అనుకూలమైన రోజు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సేవా కార్యక్రమాలు చేపట్టడం, అన్నదానం శుభప్రదం.

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
బంధుమిత్రులతో చర్చలు, ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. స్థిర, చరాస్తులకు సంబంధించిన చర్చల్లో నిదానం పాటించాలి. రవాణా, మార్కెటింగ్, కమ్యూనికేషన్లు, కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం. వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. ఒక సమాచారం ఆవేదన కలిగిస్తుంది. శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణ శుభప్రదం.

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
తోబుట్టవులు, బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులు లాభిస్తాయి. ఆర్థిక పరమైన చర్చలకు అనుకూలం విలువైన పత్రాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. గోమాతను ఆరాధించండి.

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
విలువైన వస్తువులు బహుమతులుగా అందుకుంటారు. వేడుకలు ఆనందం కలిగిస్తాయి. పెట్టుబడులకు సంబంధించి ఒక నిర్ణయానికి వస్తారు. ఆర్థిక సంస్థలతో పనులకు కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచ పారాయణ శుభప్రదం.

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
వేడుకలు, బృందకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాలకు అనుకూల సమయం. సినీ, రాజకీయ రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విష్ణుమూర్తి ఆరాధన శుభప్రదం.

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
వేడుకలు, సమావేశాల్లో కీలక పాత్ర పోషిస్తారు. గతించిన వ్యక్తులను స్మరించుకుంటారు. దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి పెడతారు. ఆర్థిక వ్యవహారాల్లో అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించడం శుభప్రదం.