శ్రీవారి ఆర్జిత సేవల జూలై నెల కోటా 18న విడుదల
ABN , Publish Date - Apr 13 , 2026 | 05:45 AM
శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల జూలై నెల కోటాను టీటీడీ ఈనెల 18న విడుదల చేయనుంది. 21వ తేదీ ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ...
తిరుమల, ఏప్రిల్ 12(ఆంధ్రజ్యోతి): శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల జూలై నెల కోటాను టీటీడీ ఈనెల 18న విడుదల చేయనుంది. 21వ తేదీ ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకారసేవ టికెట్లను విడుదల చేస్తారు. 23 ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ, 11 గంటలకు శ్రీవాణి టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు సీనియర్ సిటిజన్ల టోకెన్లు విడుదల చేయనున్నారు. 24 ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు గదుల కోటాను జారీ చేస్తారు.