శ్రీవారి వేదాశీర్వచనం టికెట్ల కుదింపు
ABN , Publish Date - Feb 20 , 2026 | 03:01 AM
తిరుమల శ్రీవారి వేదాశీర్వచనం టికెట్లను టీటీడీ కుదించింది. ఇకపై కేవలం ప్రొటోకాల్ పరిధిలోని ప్రముఖులకు మాత్రమే ఈ టికెట్లను కేటాయించాలని నిర్ణయించింది.
ప్రొటోకాల్ పరిధిలోని ప్రముఖులకే కేటాయించాలని నిర్ణయం
తిరుమల, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి వేదాశీర్వచనం టికెట్లను టీటీడీ కుదించింది. ఇకపై కేవలం ప్రొటోకాల్ పరిధిలోని ప్రముఖులకు మాత్రమే ఈ టికెట్లను కేటాయించాలని నిర్ణయించింది. ఐదారేళ్లుగా ప్రొటోకాల్ పరిధిలో లేనివారికీ వేదాశీర్వచనం టికెట్లు ఇవ్వడం ప్రారంభించారు. రోజుకు ఇరవై, ముప్పైలోపు ఉండే ఈ టికెట్లు ప్రస్తుతం వందకుపైగా దాటుతున్నాయి. చాలామంది ఈ టికెట్లు కొనుగోలు చేసి, ఆశీర్వచనం తీసుకోవడం హోదాగా భావిస్తున్నారు. రోజూ దాదాపు వందకుపైగా టికెట్లు ఇస్తున్న క్రమంలో సర్వదర్శన భక్తులు ఇబ్బంది పడుతున్నారని టీటీడీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఇకపై వేదాశీర్వచనం టికెట్లను ప్రొటోకాల్ పరిధిలోని ప్రముఖులకే కేటాయించాలనే నిబంధన పెట్టిన క్రమంలో రెండ్రోజుల్లో కేవలం 10లోపే టికెట్లు జారీ చేసినట్టు తెలిసింది.