Share News

10.30 గంటల పాటు మూతపడిన శ్రీవారి ఆలయం

ABN , Publish Date - Mar 04 , 2026 | 04:21 AM

నిత్యం వేలాది మంది భక్తులతో కిటకిటలాడే తిరుమల క్షేత్రం మంగళవారం చంద్ర గ్రహణం నేపథ్యంలో బోసిపోయింది.

10.30 గంటల పాటు మూతపడిన శ్రీవారి ఆలయం

  • చంద్ర గ్రహణం అనంతరం పలు ఆలయాల్లో దర్శనాలు ప్రారంభం

తిరుమల/శ్రీశైలం/పిఠాపురం, మార్చి3 (ఆంధ్రజ్యోతి): నిత్యం వేలాది మంది భక్తులతో కిటకిటలాడే తిరుమల క్షేత్రం మంగళవారం చంద్ర గ్రహణం నేపథ్యంలో బోసిపోయింది. దాదాపు 10.30 గంటల సమయం ఆలయం తలుపులు మూతపడ్డాయి. మంగళవారం ఉదయం 9 గంటలకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆధ్వర్యంలో అర్చకులు బంగారు వాకిలి, వెండి వాకిలి, మహద్వారం తలుపులు మూసివేశారు. మఽ ద్యాహ్నం 3.20 గంటలకు మొదలైన గ్రహ ణం 6.47 గంటలకు పూర్తయిన తర్వాత రాత్రి 7.30 గంటలకు తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యాహవచనం, ఇతర కైంకర్యాల సమర్పణ అనంతరం 8.30 గంటల నుంచి దర్శనాలను ప్రారంభించారు. కాగా, ఉదయం తలుపులు మూసివేసిన సమయంలో అదనపు ఈవో మీడియాతో మాట్లాడుతూ, అన్నప్రసాద భవనం, లడ్డూ కేంద్రాలను కూడా మూసివేసిన క్రమంలో భక్తులకు అన్నిచోట్లా పులిహోర పొట్లాలను అందజేశామని తెలిపారు. గ్రహణం నేపథ్యంలో తిరుమల క్షేత్రంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు పలుచగా కన్పించారు. దూరప్రాంతాల నుం చి వచ్చిన భక్తులు అలిపిరిలోనే వంటలు చేసుకుంటూ కనిపించారు. చంద్రగ్రహణం కారణంగా మంగళవారం శ్రీశైలంలో తెల్లవారుజామున ప్రాతఃకాల పూజల అనంతరం ప్రధాన ఆలయ ద్వారాలు మూసివేశారు. గ్రహణ కాలం వీడిన తరువాత సాయంత్రం 7:30 గంటలకు శాస్త్రోక్తంగా, పూజాధికాలతో ఆలయ శుద్ధి చేసి సంప్రోక్షణ చేశారు. ఉభయ దేవాలయాలతోపాటు పరివార దేవతాలయాలు, అనుబంధ దేవాలయాలలో కూడా ఏకకాలంలో గ్రహణానంతర ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు.


  • ముక్కంటికి గ్రహణ కాలాభిషేకాలు

శ్రీకాళహస్తి/పిఠాపురం, మార్చి 3(ఆంద్రజ్యోతి): తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో మంగళవారం విశేషంగా గ్రహణ కాలాభిషేకం జరిగింది. .మంగళశారం కేతుగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా వివిఽధ ఆలయాలు మూసివేసినప్పటికీ ముక్కంటి ఆలయంలో యధావిధిగా దర్శనాలు కొనసాగాయి. సాయంత్రం 5 గంటలకు గ్రహణ ఉచ్ఛ కాలంగా నిర్ణయించిన అర్చకులు మూలమూర్తులైన స్వామి అమ్మవార్లకు అభిషేకాలను నిర్వహించారు. అలాగే చంద్రగ్రహణ సమయంలో దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న కాకినాడ జిల్లాలోని పిఠాపురం పాదగయ క్షేత్రం తెరిచే ఉంది. అర్చకులు కుక్కుటేశ్వరస్వామికి అభిషేకాలు నిర్వహించారు.

Untitled-4 copy.jpg

Updated Date - Mar 04 , 2026 | 04:22 AM