తిరుమలలో శాస్త్రోక్తంగా శ్రీరామనవమి ఆస్థానం
ABN , Publish Date - Mar 28 , 2026 | 05:11 AM
తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీరామనవమి ఆస్థానం శాస్ర్తోక్తంగా జరిగింది. ఆలయంలోని బంగారువాకిలి వద్ద ఆస్థానాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు.
తిరుమల, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీరామనవమి ఆస్థానం శాస్ర్తోక్తంగా జరిగింది. ఆలయంలోని బంగారువాకిలి వద్ద ఆస్థానాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. అంతకుముందు ఉదయం సుప్రభాతంతో శ్రీవారిని మేల్కొలిపి తోమాలసేవ, అర్చన సేవలను నిర్వహించారు. తర్వాత ఆలయంలోని రంగనాయక మండపంలో ఉదయం సీతారామలక్ష్మణ సమేత హనుమంత స్వామి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజన సేవను కనులపండువగా నిర్వహించారు. రాత్రి హనుమంత వాహనసేవ వేడుకగా నిర్వహించారు. కాగా, శనివారం రాత్రి శ్రీరామ పట్టాభిషేకాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించనున్నారు.