జూన్ 26 నుంచి శ్రీవారి జ్యేష్టాభిషేకం
ABN , Publish Date - May 26 , 2026 | 05:30 AM
తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ 26 నుంచి 28వ తేదీ వరకు సాలకట్ల జ్యేష్టాభిషేకం జరుగనుంది.
తిరుమల, మే25(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ 26 నుంచి 28వ తేదీ వరకు సాలకట్ల జ్యేష్టాభిషేకం జరుగనుంది. మొదటిరోజు మలయప్పస్వామికి ఉండే బం గారు కవచాన్ని తొలగించి హోమాలు, అభిషేకాలు, పంచామృత స్నపన తిరు మంజనం నిర్వహిస్తారు. ఆ తర్వాత స్వామివారికి వజ్రకవచాన్ని అలంకరించి సాయంత్రం ఊరేగిస్తారు. రెండోరోజు ముత్యాల కవచం సమర్పిస్తారు. చివరిరోజు తిరుమంజనాదులు పూర్తిచేసి తిరిగి బంగారు కవచాన్ని సమర్పిస్తారు.