Share News

హంస వాహనంపై ఆదిదంపతుల విహారం

ABN , Publish Date - Feb 11 , 2026 | 02:59 AM

శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు మంగళవారం ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం తరపున...

హంస వాహనంపై ఆదిదంపతుల విహారం

శ్రీశైలంలో మూడోరోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

శ్రీశైలం, పిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు మంగళవారం ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం తరపున ఈఓ శ్రీను నాయక్‌, చైర్మన్‌ రాధాకృష్ణ స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. సాయంత్రం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవాయిద్యాలు, కళాకారుల సంగీత, జానపద నృత్యాల నడుమ క్షేత్రపురవీధుల్లో గ్రామోత్సవం జరిపారు.

Updated Date - Feb 11 , 2026 | 02:59 AM