రావణ వాహనంపై శ్రీశైల మల్లన్న
ABN , Publish Date - Feb 13 , 2026 | 03:37 AM
నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవదాయశాఖ మంత్రి ఆనం ...
రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాల సమర్పణ
శ్రీశైలం, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రి వెంట కమిషనర్ రామచంద్రమోహన్, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, కలెక్టర్ రాజకుమారి రాగా, ఆలయ రాజగోపురం వద్ద ఫెస్టివల్ ఆఫీసర్ చంద్రశేఖర్ ఆజాద్, ఈవో శ్రీనివాసరావు, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుగుంట రమేశ్ నాయుడు, ట్రస్ట్‌బోర్డు సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. కాగా.. ఐదో రోజైన గురువారం భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి రావణ వాహనంపై విహరించారు. గ్రామోత్సవంలో వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు చేసిన నృత్యాలకు ఆకర్షితులైన మంత్రి ఆనం కళాకారులతో కలిసి నృత్యం చేశారు. బ్రహ్మోత్సవాలలో ఆరో రోజైన శుక్రవారం స్వామి, అమ్మవార్లకు పుష్పపల్లకీ సేవ నిర్వహించనున్నారు.