శ్రీశైల మల్లన్నకు పాగాలంకరణ
ABN , Publish Date - Feb 16 , 2026 | 02:16 AM
ఏపీలోని శ్రీశైల క్షేత్రంలో ఆదివారం రాత్రి పరమేశ్వరుడికి పాగాలంకరణ సేవను వైభవంగా నిర్వహించారు. లింగోద్భవకాల మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతుండగా...
నంది వాహనంపై విహరించిన ఆది దంపతులు
శ్రీశైలం, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): ఏపీలోని శ్రీశైల క్షేత్రంలో ఆదివారం రాత్రి పరమేశ్వరుడికి పాగాలంకరణ సేవను వైభవంగా నిర్వహించారు. లింగోద్భవకాల మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతుండగా ఆలయ ప్రధాన గోపురంపై కలశానికి తలపాగా చుట్టే కార్యక్రమం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. నవ నందులను కలుపుతూ చేసిన పాగాలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అర్ధరాత్రి మల్లికార్జునస్వామి, భ్రమరాంబ అమ్మవార్ల కల్యాణోత్సవం కమనీయంగా సాగింది. అంతకుముందు సాయంత్రం జరిగిన ప్రభోత్సవంలో రెండున్నర లక్షల మంది భక్తులు పాల్గొన్నట్లు అంచనా. ఆ తర్వాత నంది వాహనంపై అధిష్ఠింపజేసి స్వామి, అమ్మవార్ల ఉత్సమూర్తులకు పుష్పార్చన, ఆలయోత్సవం నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు.