పుష్ప పల్లకిపై శ్రీశైలేశుడు
ABN , Publish Date - Feb 14 , 2026 | 02:38 AM
జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవ సంబరాలు అంబరానంటుతున్నాయి...
శ్రీశైలం, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవ సంబరాలు అంబరానంటుతున్నాయి. గ్రామోత్సవంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు పుష్ప పల్లకి సేవ నిర్వహించారు. పుష్పపల్లకిలో ఆది దంపతుల దివ్య దర్శనంతో భక్తజనం పులకించింది. బ్రహ్మోత్సవాల్లో 6వ రోజైన శుక్రవారం సాయంత్రం అక్కమహాదేవి అలంకారమండపంలో ఉత్సమూర్తులకు షోడషోపచార పూజలు అర్చకవేదపండితులచే జరిపించి హారతులు ఇచ్చారు. అనంతరం స్వామిఅమ్మవార్లను మేళతాళాల నడుమ గంగాధర మండపం వద్దకు తొడ్కొనివచ్చి పుష్పపల్లకిపై ఉంచి గ్రామోత్సవం నిర్వహించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు శనివారం స్వామిఅమ్మవార్లు గజవాహనంపై భక్తులకు దర్శనమిస్తారు.