Share News

మల్లన్న 13 రోజుల హుండీ ఆదాయం రూ.5.61 కోట్లు

ABN , Publish Date - Feb 20 , 2026 | 03:08 AM

నంద్యాల జిల్లా శ్రీశైల క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదిదంపతులకు భక్తులు సమర్పించిన హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు.

మల్లన్న 13 రోజుల హుండీ ఆదాయం రూ.5.61 కోట్లు

  • శ్రీశైలంలో మహా శివరాత్రి కానుకల లెక్కింపు

శ్రీశైలం, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా శ్రీశైల క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదిదంపతులకు భక్తులు సమర్పించిన హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. ఉభయ దేవాలయాలు, అన్నప్రసాద భవనం, పరివార దేవాతాలయాల హుండీలలో 13 రోజులుగా భక్తుల నుంచి స్వామి. అమ్మవార్లకు మొక్కులు, కానుకల రూపంలో రూ.5,61,81,535 ఆదాయం వచ్చినట్టు ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేశ్‌నాయుడు, ఈవో శ్రీనివాసరావు తెలిపారు. అలాగే 124.500 గ్రాముల బంగారం, 5.550 కిలోల వెండి వస్తువులు కానుకగా సమర్పించారని వెల్లడించారు.

Updated Date - Feb 20 , 2026 | 03:08 AM