నేటి రాశిఫలాలు శనివారం 31-10-2026
ABN , Publish Date - Oct 31 , 2026 | 12:43 AM
నేటి రాశిఫలాలు శనివారం 31-10-2026
నేటి రాశిఫలాలు శనివారం 31-10-2026

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
మర్మతులు, విలువైన వస్తువుల కొనుగోలుకు తగిన సమయం. గృహ రుణాలు మంజూరవుతాయి. పెట్టుబడుల గురించి ఆలోచిస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది.

వృషభం ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
కమ్యూనికేషన్లు, వాహన రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. భాగస్వామితో చర్చలు ఉల్లాసం కలిగిస్తాయి. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం. కొత్త పరిచయాలు లాభిస్తాయి. అనుబంధాలు బలపడతాయి.

మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
పెట్టుబడుల విషయాల్లో సహోద్యోగుల సలహాలు తీసుకుంటారు. ఫైనాన్స్, బ్యాంకులు, చిట్‌ఫండ్ రంగాల వారికి వృత్తిపరంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వైద్య ఖర్చులకు అవసరమైన నిధులు సమకూరుతాయి.

కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
టెలివిజన్, కళలు, ఫైనాన్స్ రంగాల వారు కొత్త మార్గాలను అనుసరించి లక్ష్యాలు సాధిస్తారు. కొత్త పరిచయాలు లాభిస్తారు. మనసు ఉల్లాసంగా ఉంటుంది. పొదుపు పథకాలపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు.

సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
ఎగుమతులు, ఫోటోగ్రఫీ, టెక్స్‌టైల్స్, ఉన్నత విద్యా రంగాల వారు తమ పురోగతిని సమీక్షించుకుంటారు. గృహనిర్మాణం, స్థలసేకరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. దూరప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. సమావేశాలు సత్ఫలితాలనిస్తాయి. డివిడెండ్‌లు, వడ్డీలకు సంబంధించిన సమాచారం అందుకుంటారు. శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణ శుభప్రదం.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వరంగ సిబ్బందికి అర్థికంగా అనుకూలమైన రోజు. ఆర్థిక విషయాల్లో తల్లిదండ్రుల సహకారం లభిస్తుంది. పలుకుబడిగల వ్యక్తులను కలుసుకుంటారు. శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించండి.

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
కొత్త ఆలోచనలు అమలు చేసి విజయం అందుకుంటారు. సమావేశాలు, ప్రయాణాలు సత్ఫలితాలనిస్తాయి. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. దూరప్రయాణాలు మనసుకు సాంత్వన కలిగిస్తాయి. సంకల్పం నెరవేరుతుంది.

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
దీర్ఘకాలిక పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. నిధులు సమకూర్చుకునేందుకు చేసే ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వైద్యం, బ్యాంకింగ్, ఫైనాన్స్ సంస్థల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.

మకరం (డిసెంబరు 22 - జనవరి 20 మధ్య జన్మించిన వారు)
వివాహ నిర్ణయాలకు అనుకూలం. శుభకార్యాలు, వేడుకల్లో బంధుమిత్రులను కలుసుకుంటారు. భాగస్వామి సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. కొత్త పరిచయాలు ఆర్థికంగా లాభిస్తాయి. శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించండి.

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ, వ్యాపారాల్లో మీ పురోగతిని సమీక్షించుకుంటారు. లక్ష్య సాధనలో సహోద్యోగుల సహకారం లభిస్తుంది. పట్టుదలతో తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. పెద్దల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపించాలి. విష్ణు సహస్ర నామ పారాయణ శుభప్రదం.

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
పొదుపు పథకాలు, పెట్టుబడులకు సంబంధించిన సమాచారం సేకరిస్తారు. విద్యార్థులు సృజనాత్మకంగా ఆలోచించి మంచి ఫలితాలు అందుకుంటారు. వాట్సాప్ సందేశాలు, మెయిల్స్ ఆనందం కలిగిస్తాయి. ప్రచురణ, కమ్యూనికేషన్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.
- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ