Share News

నేటి రాశి ఫలాలు శుక్రవారం 23-10-2026

ABN , Publish Date - Oct 23 , 2026 | 02:59 AM

నేటి రాశి ఫలాలు శుక్రవారం 23-10-2026

నేటి రాశి ఫలాలు శుక్రవారం 23-10-2026

నేటి రాశి ఫలాలు శుక్రవారం 23-10-2026

01 MESHAM.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపించాలి. మీరు తలపెట్టిన పనులకు ఆటంకాలు ఎదురుకావడంతో నిరుత్సాహం చెందుతారు. దూరంలో ఉన్న వ్యక్తులకు సంబంధించిన ఒక సమాచారం కలవరపెడుతుంది. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు ఊరటనిస్తాయి.


02 VRUSHABHAM.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. సమావేవాలు, బృందకార్యక్రమాల కోసం ఖర్చులు అంచనాలు మించుతాయి. కొత్త పరిచయాల వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. స్పెక్యులేషన్లకు దూరంగా ఉండాలి. కనకధారా స్తోత్ర పారాయణ శుభప్రదం.


03 MIDHUNAM.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

వ్యాపార రంగంలో మీ లక్ష్య సాధనకు ఆటంకాలు ఎదురవుతాయి. పై అధికారుల నుంచి ఒత్తిళ్లు ఎదురవుతాయి. పెద్దల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపించాలి. వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి అనుకూలం. దుర్గామాత ఆరాధన శుభప్రదం.


04 KARKATAM.jpg

కర్కాటకం (జూన్‌ 22-జూలై 23 మధ్య జన్మించిన వారు)

చిన్నారులు, ప్రియతముల విషయంలో మీ అంచనాలు ఫలించకపోవచ్చు, విద్యార్థులు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. సమావేశాలు, వేడుకల్లో ఖర్చులు అధికం. ఆడిటింగ్‌, న్యాయరంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. లలితా సహస్ర నామ పారాయణ శుభప్రదం.


05 SIMHAM.jpg

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

కుటుంబ సభ్యుల ఆరోగ్యం కలవర పెడుతుంది. ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ఆర్థిక విషయాల్లో మీ వైఖరిని సమీక్షించుకోవాలి. ఇంటి కోసం ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. దుర్గామాత ఆరాధన శుభప్రదం.


06 KANYA.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

భాగస్వామితో వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. ప్రయాణాలు, చర్చల్లో కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూల సమయం కాదు. సన్నిహితులకు సంబంధించిన ఒక సమాచారం ఆనందం కలిగిస్తుంది. లలితా దేవిని ఆరాధించండి.


07 TULA.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్థిక పరిస్థితి నిరుత్సాహకరంగా ఉంటుంది. అదనపు ఆదాయ కోసం చేసే ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. బోనస్‌లు, ఇంక్రి మెంట్ల విషయంలో నిరాశ మిగులుతుంది. వైద్యం, విందు, వినోదాలకు ఖర్చు చేస్తారు. కనకధారా స్తోత్ర పారాయణ శుభప్రదం.


08 VRUSCHIKAM.jpg

వృశ్చికం (అక్టోబరు 23-నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

టెలివిజన్‌, క్రీడలు, నటన, ఆడిటింగ్‌, విద్యా రంగాల వారు ఆశించిన ఫలితాల కోసం అధికంగా శ్రమించాలి. ప్రేమలు బెడిసికొట్టే అవకాశం ఉంది. చిన్నారుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. సృ.జనాత్మకంగా వ్యవహరిస్తే లక్ష్యాలు సాదిస్తారు. దుర్గామాత ఆరాధన శుభప్రదం.


09 DHANUSU.jpg

ధనుస్సు (నవంబరు 23-డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

దూరంలో ఉన్న బంధుమిత్రులకు సంబంధించిన సమాచారం ఆవేదన కలిగిస్తుంది. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారికి ఆటంకాలు ఎదురవుతాయి. వారసత్వ విషయాలు చర్చకు వస్తాయి. ప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. లలితా సహస్ర నామ పారాయణ శుభప్రదం.


10 MAKARAM.jpg

మకరం (డిసెంబరు 22 - జనవరి 20 మధ్య జన్మించిన వారు)

ఆర్థికపరమైన చర్చలు, ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. బృందకార్యక్రమాలు, సమావేశాల్లో మాటపడాల్సి రావచ్చు. ఆర్థికపరమైన పత్రాలు కోల్పోయే అవాకాశం ఉంది. బంధుమిత్రులను కలుసుకుంటారు. కనకధారా స్తోత్ర పారాయణ శుభప్రదం.


11 KUMBHAM.jpg

కుంభం (జనవరి 21-ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో పెద్దవారి సహకారం లోపిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. పెట్టుబడుల విషయంలో పెద్దల సలహాలు పాటించడం మేలు. దుర్గా మాత ఆరాధన శుభప్రదం.


12 MEENAM-FINAL.jpg

మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

కొత్త వ్యూహాలు,. ఆలోచనల అమలును ఈ రోజుకు వాయిదా వేయడం మేలు. ప్రణాళిక లోపించడం వల్ల లక్ష్యాలు సాధించలేకపోవచ్చు. ప్రయాణాలు, చర్చల్లో అసౌకర్యం కలుగుతుంది. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Oct 23 , 2026 | 03:07 AM