Share News

మయూర వాహనంపై మల్లన్న

ABN , Publish Date - Feb 12 , 2026 | 01:24 AM

శ్రీశైలం క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు బుధవారం భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు మయూర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

మయూర వాహనంపై మల్లన్న

శ్రీశైలం, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు బుధవారం భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు మయూర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అక్కమహాదేవి అలంకార మండపం వద్ద ప్రత్యేక పూజాదికాలు నిర్వహించి క్షేత్రపురవీధుల్లో గ్రామోత్సవం జరిపారు. మయూర వాహనంపై దర్శనమిచ్చిన భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను భక్తులు దర్శించుకుని నీరాజనాలు సమర్పించారు. కాగా.. బుధవారం ఉదయం కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం తరపున కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం తరపున ఈఓ కె.పెంచలకిషోర్‌, పాలకమండలి అధ్యక్షుడు మణినాయుడు స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. రాత్రి తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున డిప్యూటీ ఈఓ లోకనాథం, అర్చకులు బ్రమరాంభ మల్లికార్జున స్వామివార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఐదోరోజు గురువారం రాత్రి భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు రావణ వాహన సేవ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

Updated Date - Feb 12 , 2026 | 01:24 AM