ఇంద్రకీలాద్రిపై మహాకుంభాభిషేక క్రతువు ప్రారంభం
ABN , Publish Date - Mar 07 , 2026 | 04:57 AM
ఇంద్రకీలాద్రిపై మూడు రోజులు నిర్వహించే మహాకుంభాభిషేక క్రతువు శుక్రవారం ఆరంభమైంది. వేదపండితులు, ఆలయ అధికారులు...
దుర్గమ్మ దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు
విజయవాడ, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): ఇంద్రకీలాద్రిపై మూడు రోజులు నిర్వహించే మహాకుంభాభిషేక క్రతువు శుక్రవారం ఆరంభమైంది. వేదపండితులు, ఆలయ అధికారులు దేశంలోని మూడు సముద్ర జలాలు, 12 నదుల నుంచి సేకరించిన జలాలను కలశాలతో తీసుకుని కృష్ణానది తీరానికి చేరుకున్నారు. అక్కడ ఒక కలశంతో కృష్ణా నీటిని తీసుకుని అన్ని కలశాలకు యాగశాలలో పూజలు నిర్వహించారు. కాగా.. కుంభాభిషేకం క్రతువు ప్రారంభం కావడంతో శుక్రవారం సుమారు 70 నుంచి 80 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
విజయవాడకు చేరుకున్న కంచి పీఠాధిపతి
కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి శుక్రవారం రాత్రి విజయవాడ చేరుకున్నారు. ఆదివారం ఆయన ఆధ్వర్యంలో అమ్మవారి ప్రధానాలయం గోపుర శిఖరానికి కుంభాభిషేకం నిర్వహించనున్నారు. విజయేంద్ర సరస్వతి తొలుత అమ్మవారిని దర్శించుకుని, అనంతరం యాగశాలను పరిశీలించారు.