కాళీయమర్ధనుడిగా కోదండరామయ్య
ABN , Publish Date - Apr 04 , 2026 | 04:19 AM
ఒంటిమిట్ట కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజు శుక్రవారం ఉదయం స్వామివారు కాళీయమర్ధన అలంకారంలో భక్తలకు దర్శనమిచ్చారు.
ఒంటిమిట్ట, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): ఒంటిమిట్ట కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజు శుక్రవారం ఉదయం స్వామివారు కాళీయమర్ధన అలంకారంలో భక్తలకు దర్శనమిచ్చారు. ఉదయం 7.30 గంటల నుంచి ప్రారంభమైన గ్రామోత్సవం 9.30 గంటల వరకు జరిగింది. రాత్రి కోదండరాముడు అశ్వవాహనంపై విహరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో ప్రశాంతి, ఆలయ పర్యవేక్షణ అధికారి హనుమంతయ్య, తనిఖీ అధికారి నవీన్‌కుమార్, అర్చకులు మనోజ్‌కుమార్, పవన్‌కుమార్ పాల్గొన్నారు.