Share News

పసికందుతో 700 కిలోమీటర్ల పాదయాత్ర!

ABN , Publish Date - Mar 12 , 2026 | 03:38 AM

కర్ణాటకకు ఓ కుటుంబం ఐదు నెలల పసికందుతో 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలానికి పాదయాత్రగా వెళుతోంది.

పసికందుతో 700 కిలోమీటర్ల పాదయాత్ర!

  • మల్లన్న దర్శనానికి కర్ణాటక దంపతుల సాహసం

కోసిగి, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకకు ఓ కుటుంబం ఐదు నెలల పసికందుతో 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలానికి పాదయాత్రగా వెళుతోంది. బెలగావి జిల్లా రాయబాగ్‌ తాలుకా హందిగుండ గ్రామానికి చెందిన అమర్‌, సౌజన్య దంపతులకు ఐదు నెలల క్రితం కుమార్తె జన్మించింది. కూతురు పుడితే మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక అమ్మవారికి మొక్కు చెల్లించుకుంటామని మొక్కుకున్నారు. అందులో భాగంగానే తమ గ్రామం నుంచి దాదాపు 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలానికి పాదయాత్రగా బయలుదేరారు. వీరితో పాటు సౌజన్య తండ్రి బసవరాజు 70 ఏళ్ల వయసులో తోడుగా వీరి వెంట నడుస్తున్నారు. ఏడు రోజుల క్రితం ప్రారంభమైన వీరి పాదయాత్ర 400 కిలోమీటర్ల దూరంలోని కర్నూలు జిల్లా కోసిగికి 8వ రోజు బుధవారం చేరుకుంది. మల్లన్నపై భక్తి, విశ్వాసమే తమను నడిపిస్తోందని ఆ దంపతులు చెబుతున్నారు.

Updated Date - Mar 12 , 2026 | 03:38 AM