‘సంస్కృతి’ ట్రస్ట్ ఆధ్వర్యం శిక్షణ శిబిరం
ABN , Publish Date - Apr 19 , 2026 | 02:49 PM
శ్రీ జనార్దనానంద సరస్వతి స్వామి సంస్మృతి ట్రస్ట్ ఆధ్వర్యంలో సంధ్యావందన శిక్షణ శిబిరం నిర్వహించనున్నారు. మే 6వ తేదీ నుంచి 17వ తేదీ వరకూ హైదరాబాదు, కుంట్లూరులోని శ్రీ వేద వ్యాస పాఠశాలలో ఈ కార్యక్రమం జరగనుంది.
శ్రీ జనార్దనానంద సరస్వతి స్వామి సంస్మృతి ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్రాహ్మణ వటువులకు14వ వేసవి సంధ్యావందన శిక్షణ శిబిరం (రెసిడెన్షియల్ సమ్మర్ క్యాంపు) నిర్వహించనున్నారు. మే 6వ తేదీ నుంచి 17వ తేదీ వరకూ హైదరాబాదు, కుంట్లూరులోని శ్రీ వేద వ్యాస పాఠశాలలో ఈ కార్యక్రమం జరగనుంది. పేర్లు నమోదు చేసుకునేందుకు http://www.sjssstrust.org వెబ్‌సైట్ చూడవచ్చు. 9704706667, 8008391458 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు.
జగద్గురువులపరంపరలో వెలిగిన మహానుభావులు పరమహంస పరివ్రాజక చార్యులు శ్రీ శ్రీ జనార్దనానంద సరస్వతి స్వామి వారి 24వ ఆరాధన మహోత్సవాలు ఏప్రిల్ 18-20 మధ్య , హైదరాబాద్, కుంట్లూరు శ్రీ వేదవ్యాస పాఠశాల, హైదరాబాద్ఋలో జరుగుతున్నాయి,. ఈ పుణ్య సమయాల్లో వేదఘోషల మధ్య గణపతి పూజ, ఉపనిషత్ పారాయణులు, వేదపారాయణ, గురుపూజ, విద్వత్ సదస్సు, అన్నదానం వంటి వైదిక కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నారు.
విశిష్ఠ కార్యక్రమాలు
విద్యారణ్య, శాస్త్ర సదస్సు: వేద శాస్త్రాల ఆంతర్యాన్ని ప్రతిపాదించే ఈ సదస్సులో దేశం నలుమూలల నుంచి ప్రముఖ పండితులు, ఆధ్యాత్మిక వేత్తలు పాల్గొని తమ పుణ్య సందేశాలను అందించనున్నారు. గౌరవనీయులు, ప్రతిష్ఠాత్మక అతిథులు హాజరుకానున్న ఈ మహోత్సవంలో ప్రతి భక్తుడు పాల్గొని సంపూర్ణ ఆధ్యాత్మిక అనుభవాన్ని పాందాలని ట్రస్ట్ వారు ఆహ్వానించారు.