Share News

కనులపండువగా మహాకుంభాభిషేకం

ABN , Publish Date - Mar 09 , 2026 | 05:05 AM

ఇంద్రకీలాద్రిపై మహాకుంభాభిషేకం ఆదివారం వైభవంగా జరిగింది. ఉదయం కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి కనకదుర్గమ్మ ప్రధానాలయ గోపుర....

కనులపండువగా మహాకుంభాభిషేకం

  • దుర్గమ్మ ప్రధానాలయ శిఖరానికి కంచి పీఠాధిపతి పూజలు

  • ఇంద్రకీలాద్రిపై ముగిసిన ఉత్సవాలు.. పోటెత్తిన భక్తులు

విజయవాడ, మార్చి 8(ఆంధ్రజ్యోతి): ఇంద్రకీలాద్రిపై మహాకుంభాభిషేకం ఆదివారం వైభవంగా జరిగింది. ఉదయం కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి కనకదుర్గమ్మ ప్రధానాలయ గోపుర శిఖరం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కుంభాల్లో నింపి రెండు రోజులుగా యాగశాలలో ఉంచిన మూడు సముద్రాలు, 12 నదుల జలాలతో శిఖరానికి అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ముఖ్య కార్యదర్శి హరిజవహర్‌లాల్‌, కమిషనర్‌ కె.రామచంద్రమోహన్‌, ధర్మకర్తల మండలి చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనానాయక్‌ తదితరులు పాల్గొన్నారు. గోపురానికి మూడువైపులా ఉన్న సెల్లార్ల నుంచి భక్తులు కుంభాభిషేకాన్ని వీక్షించి పరవశించారు.

6.jpg

Updated Date - Mar 09 , 2026 | 05:05 AM