Share News

వైభవంగా శ్రీవారి తెప్పోత్సవాలు ప్రారంభం

ABN , Publish Date - Feb 27 , 2026 | 03:26 AM

తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు గురువారం సాయంత్రం వైభవంగా ప్రారంభమయ్యాయి. విద్యుద్దీపాలు, పుష్పాలతో సర్వాంగసుందరంగా...

వైభవంగా శ్రీవారి తెప్పోత్సవాలు ప్రారంభం

తిరుమల, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు గురువారం సాయంత్రం వైభవంగా ప్రారంభమయ్యాయి. విద్యుద్దీపాలు, పుష్పాలతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దిన తెప్పపై తొలిరోజు సీతాలక్ష్మణ ఆంజనేయస్వామి సమేతంగా శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు. ముందుగా సాయంత్రం 6 గంటలకు ఊరేగింపుగా బయలుదేరిన ఉత్సమూర్తులు మాడవీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుని, అప్పటికే సిద్ధం చేసిన తెప్పపైకి వేంచేశారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేదమంత్రాలు, గోవింద నామస్మరణ నడుమ తెప్పపై శ్రీరామచంద్రమూర్తి పుష్కరిణిలో మూడుసార్లు తిరిగి భక్తులకు దర్శనమిచ్చారు. టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 27 , 2026 | 03:28 AM