Share News

బాలిక కిడ్నాప్‌.. అత్యాచారయత్నం

ABN , Publish Date - Feb 19 , 2026 | 04:41 AM

శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో వైసీపీ కార్యకర్త ఓ బాలికను కిడ్నాప్‌ చేసి, అత్యాచార యత్నం చేశాడు

బాలిక కిడ్నాప్‌.. అత్యాచారయత్నం

  • శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో వైసీపీ కార్యకర్త అరాచకం

హిందూపురం, ఫ్రిబవరి 18 (ఆంధ్రజ్యోతి): శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో వైసీపీ కార్యకర్త ఓ బాలికను కిడ్నాప్‌ చేసి, అత్యాచార యత్నం చేశాడు. హిందూపురం అప్‌గ్రేడ్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ ఆంజనేయులు తెలిపిన మేరకు, మండలంలోని ఓ గ్రామంలో మహిళ తన కూతురుతో కలిసి నివసిస్తున్నారు. బాలిక తండ్రి మృతి చెందగా, తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారు. బాలిక (15) చదువు మానేసి తల్లి ఆలనా పాలనా చూసుకుంటోంది. ఈ క్రమంలో హిందూపురం మండలం కె.బసవనపల్లికి చెందిన వెంకటరమణ కుమారుడు, వైసీపీ కార్యకర్త గోవర్ధన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో బాలికను ట్రాప్‌ చేశాడు. చంపేస్తానని బెదిరించి, మూడ్రోజుల క్రితం కిడ్నాప్‌ చేసి అత్యాచారానికి యత్నించాడు. బాలిక తప్పించుకుని, తల్లితో కలిసి బుధవారం హిందూపురం అప్‌గ్రేడ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. నిందితుడు వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి దీపిక భర్త వేణురెడ్డికి సన్నిహితుడు.

Updated Date - Feb 19 , 2026 | 04:42 AM