Share News

తల్లిని చంపి తనయుడి ఆత్మహత్య

ABN , Publish Date - Jun 30 , 2026 | 05:00 AM

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లి మండలం పెద్దరావులపల్లి గ్రామంలో మద్యం మత్తులో తల్లిని చంపి తనయుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

తల్లిని చంపి తనయుడి ఆత్మహత్య

  • యాదాద్రి భువనగిరి జిల్లా పెద్దరావులపల్లిలో ఘటన

భూదాన్‌ పోచంపల్లి, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లి మండలం పెద్దరావులపల్లి గ్రామంలో మద్యం మత్తులో తల్లిని చంపి తనయుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన సంగెం పోచమ్మ(69)ను ఆమె కుమారుడు శ్రీనివాస్‌(42) హతమార్చాడు. అనంతరం ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఇంటి నుంచి దుర్వాసన రావడం, పోచమ్మ కనిపించకపోవడంతో స్థానికులు లోపలికి వెళ్లి చూడగా ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. పోచమ్మ తలపై గుండ్రాయితో మోదడంతో ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆస్తి సమస్యే హత్యకు దారి తీసి ఉంటుందని అనుమానిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది.

Updated Date - Jun 30 , 2026 | 05:00 AM