గ్యాస్ తేలేదని.. ఫినాయిల్ తాగిన భార్య..
ABN , Publish Date - Mar 30 , 2026 | 06:12 AM
భర్త వంట గ్యాస్ సిలిండర్ తీసుకురాలేదని ఓ మహిళ ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాడు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
గుత్తి, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): భర్త వంట గ్యాస్ సిలిండర్ తీసుకురాలేదని ఓ మహిళ ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాడు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తొండపాడుకు చెందిన మహాలక్ష్మి భర్త హరికృష్ణ గ్యాస్ సిలిండర్ కోసం గుత్తిలోని ఏజేన్సీ వద్దకొచ్చాడు. అయితే పశ్చిమాసియాతో యుద్ధ ప్రభావం కారణంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆయనకు గ్యాస్ సిలిండర్ ఇవ్వలేదు. దీంతో మూడు రోజులుగా సిలిండర్‌ను ఏజెన్సీ వద్దే ఉంచాడు. గ్యాస్ లేకుండా వంట ఎలా చేయాలంటూ ఆవేదన చెందిన మహాలక్ష్మి.. ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే కుంటుంబ సభ్యులు.. గుత్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.