సుత్తితో కొట్టి.. స్కూృడ్రైవర్‌తో పొడిచి..నిద్రలో ఉన్న భర్తను హత్యచేసిన భార్య
ABN , Publish Date - Jul 02 , 2026 | 04:34 AM
రాత్రి ఆరుబయట నిద్రిస్తున్న భర్తను, భార్యే మరో వ్యక్తితో కలిసి దారుణంగా హత్య చేసింది. మహబూబాబాద్ జిల్లాలోని సింగారం గ్రామంలో...
ఆమెకు సహకరించిన ఓ రౌడీషీటర్
మరో ఘటనలో మంచం కోడుతో భర్తను కొట్టి చంపిన భార్య
మహబూబాబాద్ రూరల్, పెద్దపల్లి టౌన్, జూలై 1 (ఆంధ్రజ్యోతి): రాత్రి ఆరుబయట నిద్రిస్తున్న భర్తను, భార్యే మరో వ్యక్తితో కలిసి దారుణంగా హత్య చేసింది. మహబూబాబాద్ జిల్లాలోని సింగారం గ్రామంలో ఈ ఘటన జరిగింది. హతుడు ఆ గ్రామ మాజీ ఉప సర్పంచ్ పిట్టల యాకయ్య(57). మహబూబాబాద్ రూరల్ సీఐ అంజలి వెల్లడించిన వివరాల ప్రకారం.. యాకయ్య భార్య యశోద గతంలో సర్పంచ్‌గా పనిచేసింది. యాకయ్య-యశోద దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తెకు పెళ్లయింది. కూతురు, కొడుకు ఇద్దరూ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నారు. ఐదేళ్లుగా యాకయ్య, యశోద మధ్య గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి యాకయ్య ఇంటి ఆవరణలోని వరండాలో, యశోద ఇంట్లో నిద్రపోయారు. అదే గ్రామానికి చెందిన రౌడీషీటర్ గంగుల కృష్ణ.. అర్ధరాత్రి యాకయ్య ఇంటి గేట్ తీసుకుని లోపలికి ప్రవేశించాడు. ఆ వెంటనే యశోద కూడా ఇంట్లోంచి బయటకు వచ్చింది. వరండాలో నిద్రిస్తున్న యాకయ్య ముఖంపై కృష్ణ ఊపిరాడకుండా ఓ తట్టుసంచీని కప్పాడు. ఆ వెంటనే ఇద్దరు కలిసి యాకయ్య ముఖంపై సుత్తితో కొట్టి.. స్కూృడ్రైవర్‌తో మెడపై పొడిచి చంపారు. తెల్లవారిన తర్వాత తన భర్తను ఎవరో గుర్తు తెలియ ని వ్యక్తులు హత్యచేరాంటూ యశోద బిగ్గరగా రోదించింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని యశోదను అనుమానించి విచారించగా ఘోరం బయటపడింది. యాకయ్య తండ్రి సోమయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కాగా ఇదే తరహాలో పెద్దపల్లి జిల్లాల్లో భర్తను మంచం కోడుతో కొట్టి భార్య హత్య చేసింది. గద్దల శ్రీనివాస్ (45), పుష్పలత దంపతులు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని హన్మాన్‌నగర్‌లో ఉంటున్నారు. పుష్పలత ఓ ప్రైవేట్‌స్కూల్లో టీచర్‌గా పనిచేస్తుండగా శ్రీనివాస్ కూలి పని చేస్తున్నాడు. శ్రీనివాస్ నిత్యం మద్యం తాగి భార్యతో గొడవపడేవాడు. మంగళవారం రాత్రి కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. శ్రీనివాస్ పడుకున్నాక పుష్పలత అతడిని మంచం కోడుతో తలపై కొట్టి చంపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.